E-Paper
Advertisement

మీడియా ముందు అదే తడబాటు.. దశాబ్దాల పులివెందుల కోటలో ప్రత్యర్థి జెండా?ఓటమిని జగన్ ఒప్పేసుకున్నారా?

మీడియా ముందు అదే తడబాటు.. దశాబ్దాల పులివెందుల కోటలో ప్రత్యర్థి జెండా?ఓటమిని జగన్ ఒప్పేసుకున్నారా?
Advertisement

Pulivendula: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ వేసిన ప్లాన్ తొలి విడత పక్కాగా సక్సెస్ అయ్యింది. కానీ, పోలింగ్ విషయంలో ఆయన పాచికలు పారలేదా? దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న పులివెందులలో తొలిసారి ప్రత్యర్థి జెండా రెపరెపలాడబోతోందా? జగన్ మాటలు దేనికి అర్థం? పోలింగ్ ముగియక ముందు వైసీపీ అధినేత ఓటమిని ఒప్పేసుకున్నారా? అవుననే అంటున్నాయి రాజకీయ పార్టీలు.

దశాబ్దాల పులివెందుల కోటలో ప్రత్యర్థి జెండా?

స్థానిక సంస్థల ఎన్నికలు ఏమోగానీ వైసీపీ అధినేత జగన్‌కు టెన్షన్ పట్టుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ఆదివారం బెంగుళూరు నుంచి నేరుగా పులివెందులకు హెలికాఫ్టర్‌లో సింగల్‌గా వచ్చారు. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో కొన్ని సమస్యల కారణంగా అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. దాన్ని ప్రత్యర్థులపై నెట్టేసే ప్రయత్నం చేశారు. బెంగళూరు నుంచి బయలుదేరిన హెలికాప్టర్‌ను వెనక్కి తీసుకెళ్లాలంటూ అధికారుల నుంచి హెలికాప్టర్ ఆపరేటర్‌కు వరుసగా ఫోన్ వచ్చాయి. హెలికాప్టర్‌లో ఇంధనం కొరత ఏర్పడటంతో పైలట్ ఆలస్యం చేయకుండా పులివెందులలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తన చాపర్‌ పులివెందులలో ల్యాండ్ కాకుండా ప్రభుత్వం కుట్రలు పన్నిందని ఆరోపించారు.

ఓటమిని జగన్ ఒప్పేసుకున్నారా?

Advertisement

ప్రెస్‌మీట్స్ తప్పితే.. ఓపెన్‌గా మీడియా ముందు కొచ్చిన ప్రతీసారి జగన్ తడబడుతూనే ఉన్నారు. ఇప్పుడే అదే పరిస్థితి ఎదురైంది. మాటకు మాట మధ్యలో తడబాటు పడడం స్పష్టంగా కనిపించింది. మాటల విషయంలో పక్కవారి సాయం తీసుకున్నారు మాజీ సీఎం. పులివెందులలో పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లో ఓటమిని ఒప్పేసుకున్నట్లు కనిపించారు మాజీ సీఎం. బూత్‌లలో వైసీపీ ఏజెంట్లు లేరని అసలు విషయం బయటపెట్టారు. దానికి పోలీసులు ఓటర్లను వెనక్కి పంపిస్తున్నారన్నారు. నామినేషన్ సమయంలో జరిగిన పరిణాలను గమనించిన వైసీపీ కేడర్ వెనక్కి తగ్గిపోయింది. ఒక్కసారి టీడీపీకి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయి, సైలెంట్ అయ్యారు.  తాను షర్టు మడత పెట్టానని ఎవరొస్తారో రావాలని కేడర్‌కి మూడురోజుల కిందట జగన్ దైర్యం నూరిపోసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు.

నామినేషన్ల సమయంలో జరిగిన తప్పిదాల నేపథ్యంలో ఈసారి రాష్ట్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల లోపల, బయట సీసీ కెమెరాలు పెట్టారు. అక్రమాలు జరగకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. అంతేకాదు పులివెందుల లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించింది. ఒకప్పుడు ఓటు వేయని ఓటర్లు సైతం బయటకు వచ్చి ఓటు వేశారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్‌కు ఎప్పుడూ లేని విధంగా ఓటమి భయం పట్టుకుందని అంటున్నారు రాజకీయ పార్టీల విశ్లేషకులు.

Advertisement

ALSO READ: ఎన్నికల్లో అరాచకాలు.. పులివెందులలో రీపొలింగ్‌కు జగన్ డిమాండ్, మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తాం

ప్రజలు నిర్భయంగా ఓట్లేస్తే.. రీపోలింగ్‌కు డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అంటున్నారు. పులివెందులో వైసీపీ పరిస్థితి ఈ విధంగా ఉంటే.. ఇక నేతల పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదని అంటున్నారు. నాయకుడు ఈ విధంగా వ్యవహరిస్తే.. ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు ఎవరు తీసుకెళ్తారు? వారికి భరోసా ఎవరు ఇస్తారు? ఈ లెక్కన స్థానిక ఎన్నికల భయం కొన్నాళ్ల వరకు వైసీపీ నేతలను వదిలేటట్టు కనిపించలేదని అంటున్నారు.

Related News

ఎన్నికల్లో అరాచకాలు.. పులివెందులలో రీపొలింగ్‌కు జగన్ డిమాండ్, మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తాం

పులివెందులలో హైటెన్షన్.. జగన్ కాన్వాయ్ ఆపిన దస్తగిరి, మా జీవితాలను నాశనం చేశారు, రంగంలోకి పోలీసులు

2029లో తెలుస్తుంది అసలు సినిమా! ఎన్నికల కోడ్ వచ్చాక పరిణామాలు ఎలా ఉంటాయంటే.?- పేర్ని నాని

ఏపీలో ‘మురసు’ ముసురు.. కుమ్మేస్తున్న వర్షాలు, తీర ప్రాంతాలకు అలర్ట్, తెలంగాణలో కూడా

హిందూపురంలో సతీమణితో బాలకృష్ణ ప్రత్యక్షం.. ఓటు హక్కుపై కీలక వ్యాఖ్యలు!

పులివెందులలో లాఠీఛార్జ్, సీన్‌లోకి జగన్.. వినుకొండలో బొల్లా అరెస్టు, విజయవాడలో గుర్తులు తారుమారు

ఏపీలో ‘స్థానిక’ ఎన్నికల పోలింగ్ మొదలు.. కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు, భారీగా పోలీసులు మోహరింపు

Big Stories

Advertisement
×