E-Paper
Advertisement

కేటీఆర్ ముందే కార్యకర్తలపై మల్లారెడ్డి ఆగ్రహం.. ముఖం పగలగొడతా అంటూ..

కేటీఆర్ ముందే కార్యకర్తలపై మల్లారెడ్డి ఆగ్రహం.. ముఖం పగలగొడతా అంటూ..
Advertisement

Mallareddy: స్వేచ్చ బ్యూరో: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మరోసారి తన ప్రవర్తనతో చర్చనీయాంశంగా మారారు. పార్టీ అధినేత కేటీఆర్ స్వాగత కార్యక్రమంలోనే కార్యకర్తలు, నాయకులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యకర్తలను క్రమబద్ధీకరించాల్సిన ఎమ్మెల్యే వారిపైనే విరుచుకుపడటం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది.

పార్టీ కార్యకర్తలపై మల్లారెడ్డి ఆగ్రహం..

Advertisement

ఆదిలాబాద్ పర్యటనకు వెళ్తున్న కేటీఆర్ మేడ్చల్ మీదుగా ప్రయాణిస్తుండటంతో జాతీయ రహదారి పక్కన ఉన్న వివేకానంద విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగత ఏర్పాట్లు చేశారు. అయితే కేటీఆర్ రాకముందు నుంచే మల్లారెడ్డి కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పెద్దపెద్దగా అరుస్తూ రోడ్డుపై నుంచి పక్కకు జరగాలంటూ హడావుడి చేశారు.
కేటీఆర్ రాగానే ఆయనను చూసేందుకు, స్వాగతం పలికేందుకు నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో మల్లారెడ్డి సహనం కోల్పోయినట్లు కనిపించారు. కార్యకర్తలను పక్కకు తోసేస్తూ, వారిపైకి దూసుకెళ్లి కొట్టేందుకు ప్రయత్నించినట్లు ప్రత్యక్షంగా చూసినవారు చెబుతున్నారు. అంతేకాకుండా మోచేతితో ముఖం పగలగొడతానంటూ హెచ్చరించినట్లు అక్కడి వర్గాల్లో చర్చ సాగింది. ఈ పరిణామాలను గమనించిన కేటీఆర్ స్వయంగా జోక్యం చేసుకుని ఊరుకోండి అంటూ మల్లారెడ్డిని సముదాయించినట్లు సమాచారం. పార్టీ అధినేత స్వాగత కార్యక్రమంలోనే కార్యకర్తలతో ఈ విధంగా వ్యవహరించడం అక్కడున్న నాయకులు, కార్యకర్తలను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది.

Advertisement

పార్టీ శ్రేణుల్లో గుసగుసలు..

‘అధినేతకు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలే ఎమ్మెల్యే ఆగ్రహానికి గురికావాలా?’ పార్టీ కోసం పనిచేసే శ్రేణుల పట్ల ఇలాంటి వ్యవహారశైలి ఎందుకంటూ పలువురు నాయకులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కార్యకర్తల ఉత్సాహాన్ని అర్థం చేసుకుని సమన్వయం చేయాల్సిన బాధ్యతలో ఉన్న ప్రజాప్రతినిధి, వారిపైనే ఆగ్రహం ప్రదర్శించడంపై పార్టీ శ్రేణుల్లో గుసగుసలు మొదలయ్యాయి.

Also Read: ఓయూ పరిధిలో భారీ స్కామ్? ఏకంగా 117 ప్రైవేట్ కాలేజీలకు షోకాజ్ నోటీసులు!

Tags

Related News

ఓయూ పరిధిలో భారీ స్కామ్? ఏకంగా 117 ప్రైవేట్ కాలేజీలకు షోకాజ్ నోటీసులు!

అల్వాల్‌ జానకీనగర్‌లో భారీ చోరీ.. 29 తులాల బంగారం, నగదు అపహరణ!

మల్కారం క్వారీలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎల్ నినో యాక్షన్ ప్లాన్.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం!

సీఎం రేవంత్ రెడ్డికి కవిత సంచలన లేఖ.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు డిమాండ్!

ఏపీలో ‘మురసు’ ముసురు.. కుమ్మేస్తున్న వర్షాలు, తీర ప్రాంతాలకు అలర్ట్, తెలంగాణలో కూడా

చౌటుప్పల్‌లో అర్ధరాత్రి దారుణం.. జోగిని దారుణ హత్య.. భారీగా బంగారం, నగదు దోపిడీ!

Big Stories

Advertisement
×