E-Paper
Advertisement

పులివెందులలో హైటెన్షన్.. జగన్ కాన్వాయ్ ఆపిన దస్తగిరి, మా జీవితాలను నాశనం చేశారు, రంగంలోకి పోలీసులు

పులివెందులలో హైటెన్షన్.. జగన్ కాన్వాయ్ ఆపిన దస్తగిరి, మా జీవితాలను నాశనం చేశారు, రంగంలోకి పోలీసులు
Advertisement

YS Jagan Convoy: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జగన్ కాన్వాయ్ పులివెందులలోని తన నివాసానికి చేరుకుంటున్న సమయంలో, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి తన కారును కాన్వాయ్‌కి అడ్డంగా నిలిపి హల్‌చల్ చేయడం తీవ్ర కలకలం రేపింది.

జగన్‌తో మాట్లాడాలంటూ రోడ్డుపై దస్తగిరి రచ్చ..

Advertisement

జగన్‌తో మాట్లాడాలంటూ దస్తగిరి తన వాహనాన్ని రోడ్డుకు అడ్డంగా పెట్టడమే కాకుండా, కాన్వాయ్ దరిదాపుల్లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. జగన్ ఎదుటే తీవ్ర నినాదాలు చేస్తూ విరుచుకుపడటంతో ఒక్కసారిగా అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి చేయిదాటిపోకుండా అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే దస్తగిరిని హెచ్చరించి అక్కడి నుంచి బలవంతంగా పక్కకు లాక్కెళ్లారు. అనంతరం దస్తగిరి కారును రోడ్డుపై నుంచి తొలగించడంతో జగన్ కాన్వాయ్ సురక్షితంగా ఇంట్లోకి వెళ్ళింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో జగన్ ఓటు వేసేందుకు వెళ్లనున్నారు.

పోలీసుల వైఫల్యమంటూ వైసీపీ ఆగ్రహం

Advertisement

ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి కాన్వాయ్‌కి ఒక హత్య కేసు నిందితుడు అంత దగ్గరగా వచ్చి అడ్డుపడేవరకు పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వ కుట్రలో భాగంగానే పోలీసులు కావాలని దస్తగిరికి మార్గం సుగమం చేశారని, ఇది స్పష్టంగా భద్రతా వైఫల్యమేనని వైసీపీ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

పట్టణంలో భారీగా భద్రతా బలగాల మోహరింపు

మరోవైపు పోలింగ్ నేపథ్యంలో పులివెందుల పట్టణంలో ఇప్పటికే వాతావరణం వేడెక్కింది. పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పరస్పర ఘర్షణలు, రాళ్లదాడులు జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు పట్టణమంతా భారీగా బలగాలను మోహరించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Also Read: 2029లో తెలుస్తుంది అసలు సినిమా! ఎన్నికల కోడ్ వచ్చాక పరిణామాలు ఎలా ఉంటాయంటే.?- పేర్ని నాని

Tags

Related News

ఎన్నికల్లో అరాచకాలు.. పులివెందులలో రీపొలింగ్‌కు జగన్ డిమాండ్, మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తాం

2029లో తెలుస్తుంది అసలు సినిమా! ఎన్నికల కోడ్ వచ్చాక పరిణామాలు ఎలా ఉంటాయంటే.?- పేర్ని నాని

ఏపీలో ‘మురసు’ ముసురు.. కుమ్మేస్తున్న వర్షాలు, తీర ప్రాంతాలకు అలర్ట్, తెలంగాణలో కూడా

హిందూపురంలో సతీమణితో బాలకృష్ణ ప్రత్యక్షం.. ఓటు హక్కుపై కీలక వ్యాఖ్యలు!

పులివెందులలో లాఠీఛార్జ్, సీన్‌లోకి జగన్.. వినుకొండలో బొల్లా అరెస్టు, విజయవాడలో గుర్తులు తారుమారు

ఏపీలో ‘స్థానిక’ ఎన్నికల పోలింగ్ మొదలు.. కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లు, భారీగా పోలీసులు మోహరింపు

స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్.. పులివెందులలో హింస మొదలు, వాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు

Big Stories

Advertisement
×