ఈ రోజుల్లో చాలా మంది అర్థరాత్రి వరకు నిద్రపోవడం లేదు. మళ్లీ బారెడు పొద్దెక్కేదాక లేవడం లేదు. తాజాగా ఓ తల్లి కూడా తమ పిల్లలు ఇలా చేయడంతో లేపేందుకు చాలా ఇబ్బంది పడింది. ఎంత లేపినా లేవకపోవడంతో క్రేజీ ఆలోచన చేసింది. చివరికి ఆమె చేసిన పనికి పిల్లలు ఇద్దరు షాకయ్యారు. ఇక జీవితంలో తెల్లవారిన తర్వాత నిద్ర పోకూడదని డిసైజ్ అయ్యారు.
రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం లేవకపోవడం ఇప్పడు ఒక సాధారణ అలవాటుగా మారింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి చాలా మంది వాటితో గడుపుతూ అర్థరాత్రి దాటినా నిద్రపోవడం లేదు. దీని వల్ల వారు ఉదయం ఆలస్యంగా లేస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పొద్దున్నే నిద్ర లేపేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అయినప్పటికీ వాళ్లు మారడం లేదు. తాజాగా ఇలాంటి అలవాటు ఉన్న ఇద్దరు బిడ్డలకు తన తల్లి అదిరిపోయే షాక్ ఇచ్చింది. ఇకపై తెల్లవారక ముందే నిద్రలేచి కూర్చునేలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను చూసి నెటిజన్లు నవ్వుల్లో మునిగిపోయారు.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో తెల్లవారినా ఇద్దరు అమ్మాయిలు తమ గదిలో గాఢంగా నిద్రపోతారు. ఎంత లేపినా లేవలేదు. ఈ నేపథ్యంలో ఆమె క్రేజీగా ఆలోచించి ఒక బ్యాండ్ మేళాన్ని రప్పించింది. పిల్లలు నిద్రపోతున్న గదిలోకి తీసుకెళ్లి బ్యాండ్ వాయించేలా చేసింది. బ్యాండ్ మేళం శబ్దానికి ఇద్దరు బిడ్డలు లేచి కూర్చున్నారు. ఓ అమ్మాయి ఇంకా నిద్ర మత్తులోనే ఉండగా, మరో అమ్మాయి నవ్వుతూ అక్కడి నుంచి లేచి వెళ్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
The mother called a band to wake up the kids who were sleeping late in the morning. pic.twitter.com/U3b1A67oju
— Ghar Ke Kalesh (@gharkekalesh) October 25, 2025
Read Also: రన్నింగ్ కారులో నుంచి మూత్రం పోసిన యువకుడు, నెట్టింట వీడియో వైరల్!
ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో @gharkekalesh అనే యూజర్ షేర్ చేశాడు. “తెల్లవారినా నిద్రపోతున్న తన పిల్లలను మేల్కొలపడానికి తల్లి బ్యాండ్ ను పిలిచింది” అనే క్యాప్షన్ తో ఈ వీడియోను పోస్టు చేశాడు. మొత్తం ఈ వీడియో అర నిమిషం పాటు ఉంది. ఇప్పటి వరకు సుమారు 5 లక్షల వ్యూస్ సాధించింది. వేలకొద్ది లైక్స్ అందుకుంది. వందల కొద్ది కామెంట్స్ వచ్చాయి. “పిల్లలను మంచం మీద నుండి లేపడానికి ఇది గొప్ప మార్గం! నన్ను నమ్మండి, ఈ మేల్కొలుపు విధానం తర్వాత, వారు మళ్ళీ ఆలస్యంగా నిద్రపోయే ధైర్యం చేయరు” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “ఒక బకెట్ నీళ్లు పోస్తే బ్యాండ్ మేళం కోసం పెట్టిన ఖర్చు మిగిలేది” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లకు ఫుల్ కామెడీ పంచుతోంది.
Read Also: సీజన్‌తో పనిలేదు.. ఈ బామ్మ దగ్గర 365 రోజులు మామిడి పండ్లు దొరుకుతాయ్, అందుకు ఏం చేస్తోందంటే?