Brahmamudi serial today Episode: కోర్టులో వాదోపవాదాలు మొదలవుతాయి. యామిని తరపున లాయర్ కావ్యను ప్రశ్నిస్తాడు. తప్పు చేసిన శ్రీను ఇంటికి మీరు ఎందుకు వెళ్లారు అని అడుగుతాడు. వెళ్లానని ఎందుకు అలా చేశారో అడగడానికి వెళ్లాను అని కావ్య చెప్తుంది. అయితే అబద్దం చెప్పించడానికి వెళ్లారా అని లాయర్ అడగ్గానే.. అది మీరు చెప్తే ఎలా అంటూ కావ్య ప్రశ్నిస్తుంది. మీరు చెప్పేదంతా కోర్టు నమ్మాలి కదా.? ఇక మీరు వెళ్లొచ్చు అంటూ విన్నారు కదా మైలార్డ్ శ్రీనును కోర్టుకు రాకుండా చేస్తే.. కేసు నుంచి బయట పడొచ్చని అక్కా చెల్లెలు కలిసి ప్లాన్ చేశారు అని లాయర్ చెప్పగానే.. నో మైలార్డ్ నేను ఏ తప్పు చేయలేదు. శ్రీను ఎక్కడ ఉన్నాడో కూడా నాకు తెలియదు. అయినా ఒక పోలీస్ అయి ఉండి కేసు విచారణ జరిగే టైంలో సాక్షిని కలవకూడదని నాకు తెలియదా..? నేను ఎందుకు కలుస్తాను అంటుంది.
దీంతో జడ్జి అపూర్వ గారు మీరు పోలీస్ అయ్యుండి కోర్టులో ఎలా ఎప్పుడు మాట్లాడాలో తెలియదా..? అని అడగ్గానే.. అప్పు సారీ చెప్తుంది. చిరాకుగా కావ్య బయటకు వెళ్లిపోతుంది. అటూ ఇటూ చూసి రాజ్ కోసం వెతుకుతుంది. ఈయన ఇంకా రాలేదేంటి.. అంటూ ఫోన్ చేస్తుంది. ఫోన్ స్విచ్చాప్ వస్తుంది. ఇంతలో యామిని వస్తుంది. ఏంటి కావ్య భయం వేస్తుందా..? ఆర్గుమెంట్స్ లోపల జరుగుతుంటే.. నువ్వేంటి ఇలా గుమం ముందు వెయిట్ చేస్తున్నావు. ఓ బావ సాక్ష్యం సంపాదించడానికి వెళ్లాడు అని చెప్పావు కదా..? వచ్చాడా..? అసలు వస్తాడా..? గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకుంటున్నావు. నీ చేతులతో నీ చెల్లెలు జీవితాన్ని పాడు చేస్తున్నావు. ఇలా నువ్వు బావ కోసం వెయిట్ చేస్తూ ఉండు.. లోపల నీ చెల్లికి జడ్జి గారు శిక్ష వేస్తారు అనగానే..
కావ్య కోపంగా గట్టిగా యామిని అంటూ ఆరుస్తుంది. దీంతో యామిని ఏంటి కోపం వచ్చిందా..? తను జైలుకు వెళ్తుంది అంటేనే నువ్వు తట్టుకోలేవు.. ఇక నిజంగా వెళితే ఏలా తట్టుకుంటావు కావ్య.. నా మాట విని నేను చెప్పినట్టు విని ఇప్పటికైనా ఒప్పుకో కావ్య అంటుంది. దీంతో కావ్య ఒప్పుకోను అసలు ఒప్పుకోను పైన దేవుడు అనే వాడు ఒకడున్నాడు. ఆయన కచ్చితంగా సాక్షిని తీసుకుని వస్తారు.. నా చెల్లిని కాపాడతారు.. అని చెప్పగానే యామిని నవ్వుతూ.. నీదంతా బ్రమ యామిని.. వాస్తవంగా నీ చెల్లి తప్పించుకోలేదని నీకు కూడా తెలుసు.. పద కాసేపట్లో జడ్జి గారు వేసే శిక్ష విందాం అంటూ లోపలికి వెళ్లిపోతుంది యామిని..
మరోవైపు శ్రీను బయటకు వెళ్తాను అని అడుగుతుంటే యామిని రౌడీలు వెళ్లొద్దని కట్టడి చేస్తారు. శ్రీను ను కొట్టబోతుంటే.. ఇంతలో రాజ్ వచ్చి రౌడీలను కొట్టి.. శ్రీనును తీసుకుని వెళ్తుండగా.. రౌడీలు వెనక నుంచి వచ్చి రాజ్ తల మీద కొడతారు. దీంతో రాజ్ స్పృహ కోల్పోతాడు. మరోవైపు కోర్టులో లాయరు అప్పు తప్పు చేసిందని ఫ్రూవ్ అయింది. వెంటనే ఈమెకు శిక్ష వేసి న్యాయాన్ని కాపాడాలని కోరుతున్నాను అంటాడు. దీంతో జడ్జి అప్పు లాయర్‌ను మీరు ఏదైనా చెప్పేది ఉందా అని అడుగుతాడు. దీంతో అప్పు లాయర్ లేచి లంచం ఇచ్చిన శ్రీను కోర్టుకు హాజరు కాలేదు. కొంచెం టైం ఇస్తే తగిన సాక్ష్యాలు కోర్టుకు సమర్పిస్తానని అడుగుతాడు. దీంతో యామిని లాయర్ అబ్జక్షన్ చెప్తూ ఇప్పటికే సాక్షిని కనిపించకుండా చేశారు. తక్షణమే అతన్ని వెతికించి అతనికి న్యాయం చేయాలని అప్పుకు వెంటనే శిక్ష వేయాలని కోరుతాడు.
కళ్యాణ్, కావ్య బాధపడుతుంటారు. రాజ్ ఇంకా రాలేదని ఎదురుచూస్తుంటారు. ఇంతలో జడ్జి శిక్ష ఖరారు చేయబోతుంటే.. రాజ్ ఆగండి సార్ అని శ్రీనును తీసుకుని వస్తాడు. రాజ్, శ్రీనును చూసిన కావ్య, కళ్యాణ్, అప్పు హ్యాపీగా ఫీలవుతారు. యామిని షాక్ అవుతుంది. జడ్జి.. శ్రీనును విచారిస్తాడు. శ్రీను తప్పు ఒప్పుకుని నిజం చెప్తాడు. అయితే యామిని పేరు బయటకు చెప్పడు. దీంతో జడ్జి.. అప్పును నిర్దోషిగా విడుదల చేస్తాడు. శ్రీనుకు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తాడు. యామిని ఇరిటేటింగ్‌గా ఫీలవుతుంది. అప్పు, కళ్యాణ్, కావ్య, రాజ్ హ్యాపీగా ఫీలవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?