BigTV English
Advertisement

CBI: వివేకా హత్య కేసులో జగన్ పేరు!.. అవినాష్‌రెడ్డి కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు సీబీఐ కౌంటర్

CBI: వివేకా హత్య కేసులో జగన్ పేరు!.. అవినాష్‌రెడ్డి కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు సీబీఐ కౌంటర్
jagan avinash viveka

Viveka murder latest news(AP breaking news today): వివేకా హత్య కేసులో జగన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. సీబీఐ దాఖలు చేసిన అనుబంధ కౌంటర్‌లో జగన్ టాపిక్ ప్రస్తావించింది. వివేకా చనిపోయారనే విషయం ఆయన పీకే కృష్ణారెడ్డి బయటపెట్టడానికంటే ముందే.. సీఎం జగన్‌కు ఆ విషయం తెలుసని సీబీఐ చెబుతోంది. మరి, జగన్‌కు అంతముందుగా చెప్పింది ఎవరు? అవినాష్‌రెడ్డేనా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని సీబీఐ అంటోంది.


వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు రాత్రి 12.27 నుంచి 1.10 వరకు అవినాష్‌రెడ్డి వాట్సప్‌ కాల్స్‌ మాట్లాడారని.. ఉదయం 6.15 గంటలకు ముందే జగన్‌కు వివేకా మర్డర్ గురించి తెలిసిందని అంటోంది. ఈ విషయం అవినాష్‌రెడ్డిని అడిగితే వివరాలు చెప్పడం లేదని.. హత్య వెనుక భారీ కుట్రను అవినాష్‌రెడ్డి రివీల్ చేయడం లేదని.. ఆయన విచారణకు సహకరించడం లేదని సీబీఐ తన కౌంటర్‌లో తెలిపింది.

ఎప్పుడు నోటీసులు ఇచ్చినా.. విచారణకు రాకుండా అవినాష్‌రెడ్డి ఏదో ఒకటి చేస్తున్నారని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. మే 15న నోటీసు ఇస్తే.. 4 రోజులు సమయం కావాలన్నారు. తిరిగి మే 19న నోటీస్ ఇస్తే తల్లి అనారోగ్యం వల్ల రాలేనన్నారు. కావాలనే హైదరాబాద్‌ విడిచి వెళ్లారు. విచారణకు రావాలని ఫోన్‌ చేసినా ఆయన హాజరుకాలేదు.


మే 22న రావాలని నోటీస్ ఇస్తే తల్లి అనారోగ్యం కారణంగా మరో వారం గడువు కావాలన్నారు. అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఈనెల 22న సీబీఐ బృందం కర్నూలు వెళ్లిందని.. అతని అనుచరులను చూసి శాంతిభద్రతల సమస్య రావొచ్చని భావించామని..అఫిడవిట్‌లో తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. జూన్‌ 30లోగా వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉన్నందున.. అవినాష్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వొద్దని.. అతన్ని కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ చేయాల్సి ఉందని.. సీబీఐ అనుబంధ కౌంటర్‌లో తెలిపింది. ఈమేరకు శనివారం సీబీఐ తరఫు న్యాయవాది తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు. దీంతో, అవినాష్ ముందస్తు బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది.

Related News

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

Big Stories

×