E-Paper
Advertisement

Jagan: యూరప్ టూర్‌లో మాజీ సీఎం ఫ్యామిలీ.. న్యూ లుక్‌లో జగన్, ఎయిర్‌పోర్టులో ఆ మహిళ ఎవరు?

Jagan: యూరప్ టూర్‌లో మాజీ సీఎం ఫ్యామిలీ.. న్యూ లుక్‌లో జగన్, ఎయిర్‌పోర్టులో ఆ మహిళ ఎవరు?
Advertisement

Jagan: వైసీపీ అధినేత జగన్ రూటు మార్చారా? యూరప్ టూర్‌కి బయలుదేరారా? ఈసారి కొత్తగా ట్రెండీ లుక్‌లో దర్శినమిచ్చారా? ఇంతకీ ఏమైనా విశేషం ఉందా? ఎయిర్‌పోర్టులో జగన్ పక్కన ఆ మహిళ ఎవరు? దీనిపై వైసీపీ నేతలు, అభిమానులు ఏమంటున్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

యూరప్ టూర్‌లో మాజీ సీఎం ఫ్యామిలీ

Advertisement

వైసీపీ అధినేత జగన్ విదేశీ పర్యటనకు బయలుదేశారు. కుటుంబ సభ్యులతో కలిసి యూరప్‌లోని పలు దేశాలను సందర్శించేందుకు ఆయనకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పర్మీషన్ ఇచ్చింది. ఈనెల 20వ నుంచి మే 15వ వరకు విదేశాల్లో పర్యటించనున్నారు. మొత్తం 25 రోజుల పాటు విదేశాల్లో ఆయన గడపనున్నారు.

షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 20న ఆయన విదేశీ పర్యటనకు వెళ్లాలి. ఐదురోజులు గ్యాప్ తర్వాత ఆయన టూర్‌కి బయలుదేరారు. శనివారం అర్ధరాత్రి బెంగళూరు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లారు. నిత్యం సింపుల్‌గా ఉండే జగన్, ఈసారి కాస్త వెరైటీ లుక్‌లో కనిపించారు.

Advertisement

న్యూ లుక్‌లో జగన్, ఎయిర్‌పోర్టులో ఆ మహిళ ఎవరు?

ఎయిర్‌పోర్టులో హార్డ్‌కోర్ అభిమానులు జగన్‌ని తమ ఫోన్లలో బంధించే ప్రయత్నం చేశారు. జీన్ షర్ట్, ప్యాంట్, ఆపై షూ, ఖరీదైన వాచీతో కనిపించారు. ఉన్నట్లుండి ఏమైనా విశేషం ఉందా అంటూ ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అప్పుడే చర్చలు పెట్టుకోవడం మొదలైంది.  అధినేత యూరప్ టూర్‌కి వెళ్లిన ప్రతీసారీ కొత్త లుక్‌లో దర్శినమిస్తారని అంటున్నారు.

అదే సమయంలో వైఎస్ఆర్ విదేశాలకు వెళ్లినప్పుడు షూట్‌లో కనిపించేవారని, దాన్ని జగన్ ఫాలో అవుతున్నట్లు చెబుతున్నారు.  గతంలో కూడా ఇదే విధంగా వెళ్లారని గుర్తు చేసుకుంటున్నారు. మొత్తానికి ట్రెండ్‌కు తగ్గట్టుగా జగన్ కనిపించడంతో  ఫోటో, వీడియోలను వైసీపీ అభిమానులు షేర్ చేస్తున్నారు.

ALSO READ: బీజేపీ లేకపోతే టీడీపీ, జనసేన ఉండదా?.. గతం మరిచారా?

ఇంతవరకు బాగానే ఉంది. బెంగుళూరు ఎయిర్‌పోర్టులో ఓ మహిళ జగన్ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇంతకీ ఆ మహిళ ఎవరు?  అర్ధరాత్రి ఎయిర్‌పోర్టుకి వచ్చిన ఆమె.. వైసీపీ అభిమానా? అంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు.  జగన్ ఎయిర్‌పోర్టు వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. మొత్తానికి రెండువారాల తర్వాత వైసీపీ అధినేత జగన్ మళ్లీ తాడేపల్లిలో ప్యాలెస్‌లో దర్శనమీయనున్నారు.

 

Related News

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

Big Stories

Advertisement
×