BigTV English

Viral Video: సూపర్ మార్కెట్ లో పాడుపని చేసిన యువతి.. వీడియో చూసి మండిపడిన నెటిజెన్స్!

Viral Video: సూపర్ మార్కెట్ లో పాడుపని చేసిన యువతి.. వీడియో చూసి మండిపడిన నెటిజెన్స్!

Viral Video| సోషల్ మీడియాలో వీడియోలు అప్ లోడ్ చేసి వాటికి విపరీతంగా వ్యూస్ రావాలని ఊహించని పనులు చేస్తుంటారు ఇన్‌ఫ్లూయెన్సర్లు. రాత్రికి రాత్రి వీడియాలో వైరల్ అయిపోవాలని ఒకరు ప్రాణాలకు తెగించి స్టంట్స్ చేస్తుంటే, మరొకరు అవతలి వారికి ప్రమాదమని తెలిసినా పిచ్చి చేష్టలు చేస్తుంటారు.


మరికొందరైతే బహిరంగంగానే అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. ఈ కోవలోనే ఒక అందమైన యువతి ఒక సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తూ.. చాలా అశ్లీలమైన ఒక పనిచేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో చూసిన వారంతా ఆ యువతిని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

వీడియో లో ఒక పాశ్చాత్య దేశానికి చెందిన ఒక అందమైన యువతి పొట్టి డ్రెస్సు వేసుకొని సూపర్ మార్కెట్ లో ట్రాలీ తీసుకొని షాపింగ్ చేస్తూ కనిపిస్తుంది. అయితే ఆమె వెంటే ఒకరు వీడియో రికార్డ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఏదో స్పానిష్ భాషలో మాట్లాడుతూ ఒక్కసారిగా తన వేసుకున్న స్కర్ట్ లో నుంచి తన అండర్ వేర్ బయటికి తీస్తుంది. ఆ తరువాత అండర్ వేర్ ని పక్కనే ఉన్న బ్రెడ్ సెక్షన్ లో దాచేస్తుంది.


అయితే ఆమె ఇదంతా చేస్తుండగా.. పక్కనే కొందరు చూసి కూడా స్పందించరు. ఈ యువతి ఇదంతా రికార్డ్ చేసి అక్కడి నుంచి తన ట్రాలీ తీసుకొని వెళ్లిపోతుంది. ఈ వీడియోని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్పెయిన్ దేశ స్థానిక మీడియా ప్రకారం.. ఈ ఘటన మర్కడోనా సూపర్ మార్కెట్ లో జరిగింది. ఈ యువతి పేరు క్లోయి లోపెజ్ ఆమె ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. లోపెజ్ తనకు పాపులారిటీ రావాలిని తరుచూ ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.

లోపెజ్ వీడియోపై మండిపడుతున్న నెటిజెన్స్
క్లోయి లోపెజ్ తాజాగా పోస్ట్ చేసిన వీడియోపై చాలామంది ఇంటర్నెట్ యూజర్స్ స్పందించారు. ఆమె వీడియో చాలా అశ్లీలంగా ఉందని.. లోపెజ్ వీడియో చేయడానికి అన్ని హద్దులు దాటేసిందని ఒక యూజర్ కామెంట్ చేశాడు. మరొకరైతే ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం.. ఆమెపై పోలీసులు లేదా సూపర్ మార్కెట్ నిర్వహకులు చర్యలు ఎందుకు తీసుకోలేదా? ఒక యూజర్ ప్రశ్నించాడు.

Also Read:  ‘నా ఇష్టం మీకేంటి?’.. 16 ఏళ్ల అబ్బాయిని డేట్ చేస్తున్న 21 ఏళ్ల భామ..

మరొకరైతే లోపెజ్ డబ్బులు సంపాదించడానికి ఇలాంటి వీడియోలు చేస్తోందని రాశాడు. ఇంకొక యూజర్ ఆమె జనాలను ఆకర్షించాలని పిచ్చి చేష్టలు చేస్తోంది. ఆమెకు బుద్ధి చెప్పడం చాలా అవసరం అని మండిపడ్డాడు. ఒక యూజర్ ఆమెకు సూపర్ మార్కెట్ నిర్వహకులు సహకరిస్తున్నారని.. అక్కడ నుంచి ప్రజలు షాపింగ్ చేయడం మానేస్తే తిక్క కుదురుతుందని రాశాడు. చివరగా ఒక యూజర్ చాలా తీవ్రంగా స్పందించాడు. ఆమె మనిషిగా పుట్టి తినే ఆహారాన్ని అవమానించిందని ఆమెను జైలులో పెట్టాలని రాశాడు.

అయితే లోపెజ్ వీడియో పై కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రస్తుతం ఆమెపై న్యూసెన్స్ కేసు నమోదు అయింది.

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!

Related News

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Big Stories

×