BigTV English

Jagan Smile: ఎక్క‌డ కొట్టారు.. ప్ర‌స‌న్న మాట‌ల‌కు జ‌గ‌న్ న‌వ్వులు

Jagan Smile: ఎక్క‌డ కొట్టారు.. ప్ర‌స‌న్న మాట‌ల‌కు జ‌గ‌న్ న‌వ్వులు

శుభానికి, అశుభానికి ఒకటే ఎక్స్ ప్రెషన్ ఇస్తారని జగన్ పై పెద్ద అపవాదు ఉంది. అది అపవాదు కాదు నిజమేనని ఆయన చాలా సార్లు ప్రూవ్ చేసుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. తాజాగా ఆయన నెల్లూరు జిల్లా పర్యటన కూడా ఇదే విషయాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. జగన్ వెళ్లిన పని పరామర్శ. ఒకటి కాదు, రెండు. ఒకటి జైల్లో కాకాణి గోవర్దన్ రెడ్డిని పరామర్శించడం, రెండోది ఇంటి వద్ద నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఓదార్చడం. ఈ రెండు పరామర్శల్లో ఒకటి మాత్రమే మనం చూడగలం. జైలులో కాకాణిని జగన్ ఏమని ఓదార్చారు, ఎలా ధైర్యం చెప్పారనేది పక్కన ఉన్నవారికి మినహా ఎవరికీ తెలియదు. ఇక ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడాన్ని మాత్రం అందరూ చూశారు. పరామర్శ అంటే జగన్ ఏదో బాధపడుతున్నట్టు ఉండాలి కానీ, ఏం ప్రసన్నా బాగున్నావా, దెబ్బలు బాగా తగిలాయా..? అన్నట్టు ఉండకూడదు. ఇక్కడ మనం ఏం ఉండకూడదు అని చెప్పుకున్నామో అవన్నీ ఉన్నాయి. అందుకే నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లతో రెచ్చిపోతున్నారు.


చిరునవ్వు..
జగన్ చిరునవ్వు అభిమానులకు బాగా నచ్చుతుంది. ఆయన వ్యతిరేకులు మాత్రం షిక్కటి షిరునవ్వు అంటూ కామెంట్ చేస్తుంటారు. నెల్లూరు పర్యటనలో కూడా అదే జరిగింది. జైలులో కాకాణిని పరామర్శించిన అనంతరం నెల్లూరులోని మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు జగన్. అక్కడ ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారందర్నీ పేరు పేరునా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి గురించి కుటుంబ సభ్యులు జగన్ కి వివరించారు. వాస్తవానికి ఆ సందర్భంలో జగన్ గంభీరంగా ఉండాలి. ప్రసన్నపై జరిగిన దాడిని ఖండించి, వైరి వర్గానికి అక్కడ్నుంచే హెచ్చరికలు జారీ చేయాలి. కానీ ఆ గంభీర వాతావరణాన్ని కూడా తన చిరునవ్వుతో మార్చేశారు జగన్. అక్కడే ఆయన ట్రోలర్లకు దొరికిపోయారు. జగన్ పరామర్శకు వెళ్లినట్టుగా లేదని అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. జగన్ నవ్వుతున్న ఫొటోల్ని వైరల్ చేస్తున్నారు.

నెల్లూరులో హడావిడి..
జగన్ నెల్లూరు పర్యటన మొత్తం హడావిడిగా జరిగింది. జన సమీకరణ వద్దంటూ పోలీసులు ముందునుంచీ హెచ్చరిస్తున్నా.. జిల్లా నాయకులు పోటీపడి మరీ జనాల్ని తరలించినట్టుగా తెలుస్తోంది. కాకాణిని కలిసే సందర్భంలో జైలు వద్ద కూడా కార్యకర్తల సందడి నెలకొంది. ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గరకు కూడా కార్యకర్తలు తరలి వచ్చారు. జగన్ కూడా తన ప్రసంగంలో పోలీసులు తన పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తనంటే టీడీపీ నేతలకు ఎందుకంత భయం అని అన్నారు. సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ తన ఉనికి చాటుకోడానికే ఇలాంటి పర్యటనలు చేస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే జనాల్ని తరలిస్తున్నారని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు. పర్యటనలతో ప్రజల ప్రాణాలు తీయడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అంటున్నారు టీడీపీ నేతలు.


Related News

Bonda Uma On Pawan: పవన్ ను పొగుడుతూ బొండా ఉమా వరుస ట్వీట్లు.. వివాదం ముగిసినట్లేనా?

AP Rains: ఏపీపై ఉపరితల ద్రోణి ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Vahana Mitra Scheme: వాహన మిత్ర పథకం దరఖాస్తులో సమస్యలా? అయితే ఇలా చేయండి?

Tirumala: తిరుమల పరకామణిలో రూ.100 కోట్ల స్కామ్.. టీటీడీ బోర్డు సభ్యుడు సంచలన ఆరోపణలు

CM Chandrababu: మీ ఇంటికి వచ్చి ఓ వస్తువు ఇస్తారు.. మీ చెత్త వారికి ఇవ్వండి.. సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

Bonda Vs Pawan: బొండా ఉమ ఓవర్ చేస్తుండు.. సంగతేంటో చూడండి.. బాబుకు పవన్ కంప్లైంట్

Jagan In Assembly: అసెంబ్లీలో జగన్.. ఏం మాట్లాడారో వినండి, ఇదెప్పుడు జరిగింది అధ్యక్ష!

MLCs Jump: ముగ్గురు ఎమ్మెల్సీలు జంప్.. తేలు కుట్టిన దొంగలా వైసీపీ

Big Stories

×