Vijay Deverakonda : “ఎంకన్న సామి ఈ సారి నా పక్కనుండి నన్ను నడిపించినాడో.. చానా పెద్దొడినై పూడుస్తాను సామి” ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా… తిరుపతిలో కింగ్‌డం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ టైంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ అన్న డైలాగ్ ఇది. నేడు థియేటర్‌లోకి ఆ మూవీ వచ్చిన తర్వాత ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హిట్ మొహం చూసి 7 ఏళ్లు అవుతుంది. గీతా గోవిందం తర్వాత 7 ఏళ్లల్లో 7 సినిమాలు చేశాడు. అన్నీ సినిమాలు కూడా బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడ్డాయి. అయితే, ఈ 7 ఏళ్ల తర్వాత విజయ్ దేవరకొండకు హిట్ కొట్టే ఛాన్స్ వచ్చింది అంటూ హోప్స్ పెట్టుకున్న మూవీనే ఈ కింగ్‌డం.
జర్సీ లాంటి సినిమా చేసిన గౌతమ్ తో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడు అని అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ తన రూట్ మార్చాడు అని అనుకున్నారు. 6 బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్ తర్వాత విజయ్ కి హిట్ వచ్చినట్టే అనుకున్నారు.
అలాంటి హైప్‌తో నేడు థియేటర్స్ లోకి వచ్చిన కింగ్‌డం మూవీకి కొన్ని ఏరియాల్లో నుంచి నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి. మరికొన్ని ఏరియాల నుంచి మిక్సిడ్ టాక్ వస్తుంది.
ఇలాంటి టాక్‌తో హిట్ కొట్టడం సాధ్యం కాదు… దీంతో ఆనాడు తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 7 ఏళ్ల నిరీక్షిణకు తెర పడుతుందని అనుకుంటే, ఇలాంటి టాక్ వస్తుందేంటి అంటూ విజయ్ దేవరకొండ అభిమానులు నిరాశపడుతున్నారు.
యాంటి ఫ్యాన్స్… “ఎంకన్న సామి ఈ సారి నా పక్కనుండి నన్ను నడిపించినాడో.. చానా పెద్దొడినై పూడుస్తాను సామి” ఈ డైలాగ్‌ను గుర్తు చేస్తూ… విజయ్ ని ఏడుకొండల ఎంకన్న సామి కూడా కాపాడలేకపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పుడు ఆయన హోప్స్ అన్నీ కూడా దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ‘రౌడీ జనార్ధన్’ మూవీపైనే ఉన్నాయి. ఈ సినిమా కూడా ఇలాంటి టాక్ తెచ్చుకుంటే, విజయ్ దేవరకొండ కెరీర్ ముగిసినట్టే అనుకోవాల్సి వస్తుందని క్రిటిక్స్ అంటున్నారు.