YS Abhishek Reddy: వైఎస్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ బంధువు అభిషేక్ రెడ్డి మరణించాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంగళవారం రాత్రి గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. కొన్నాళ్లుగా బ్రెయిన్ స్టోక్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
అభిషేక్ మరణంతో ఆ ఫ్యామిలీ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గతంలో కడప జిల్లా లింగాల మండల వైసీపీ అధ్యక్షుడుగా అభిషేక్ రెడ్డి పని చేశాడు. ఆయన మృతికి పలువురు వైసీపీ నేతలు సంతాపం తెలిపారు. అభిషేక్ పార్థీవ దేహాన్ని హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలించారు.
బుధవారం పులివెందులలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జగన్ దంపతులు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభిషేక్ రెడ్డి ఎవరో కాదు.. ఎంపీ అవినాష్‌రెడ్డికి స్వయంగా పెదనాన్న వైఎస్ ప్రకాశ్‌రెడ్డికి మనవడు. డాక్టర్‌గా కొనసాగుతూనే వైసీపీ కోసం పని చేశాడు.
ప్రస్తుతం వైసీపీ డాక్టర్ల విభాగానికి కార్యదర్శిగా సేవలందించాడు. కడప జిల్లాలో అవినాష్ రెడ్డితో అభిషేక్ కీలకంగా వ్యవహరించిన వారిలో ఉన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేశారు. అప్పటికే అభిషేక్ పరిస్థితి విషమంగా ఉందనే చర్చ లేకపోలేదు. ఈ వ్యవహారంపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకున్న విషయం తెల్సిందే.
ALSO READ: సంక్రాంతి సెలవులపై వచ్చిన క్లారిటీ.. మళ్లీ పాఠశాలలు పునః ప్రారంభం ఎప్పుడంటే?
YS జగన్ బంధువు YS అభిషేక్ రెడ్డి మృతి
గత కొన్ని నెలలుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే మృతి
కడప జిల్లా లింగాల మండల వైకాపా అధ్యక్షుడు గా ఉన్న అభిషేక్ రెడ్డి
అనారోగ్య కారణాలతోనే YS అభిషేక్ రెడ్డి మృతి pic.twitter.com/HdNmmtA6dl
— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2025