BigTV English
Advertisement

Food Poison: వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? విషంగా మారతాయి జాగ్రత్త!

Food Poison: వీటిని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? విషంగా మారతాయి జాగ్రత్త!

ఆహారం ఎక్కువ కాలం పాటు నిల్వ చేసేందుకు వాటిని ఫ్రిజ్‌లో పెడుతూ ఉంటారు. వంట గదిలో అలా వదిలేస్తే ఆ ఆహారం పాడైపోయే అవకాశం ఉంది. అందుకనే ఆహార వృధాను తగ్గించడానికి ఇలా ఫ్రిడ్జ్ లో పెడుతున్నామని అనుకుంటారు. నిజానికి కొన్ని రకాల ఆహారాలు ఫ్రిజ్లో పెట్టకూడదు. ఇవి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన కొన్ని నిమిషాలకే ఇవి విషపూరితంగా మారవచ్చు. వాటి వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రిజ్ లో పెట్టకూడని ఆహారాలేవో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.


ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు
వెల్లుల్లిని బయటే వదిలేస్తే పాడవ్వవు. కొంతమంది వెల్లుల్లి రెబ్బలను ఒలిచేసి ఒక కంటైనర్ లో వేసి ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు వీటిని తీసి వాడుకోవచ్చని అనుకుంటారు. నిజానికి ఇది మంచి పద్ధతి కాదు. వెల్లుల్లి రెబ్బలను తీసి ఫ్రిజ్ లో నిల్వ చేయడం వల్ల అది క్యాన్సర్ కారకంగా మారుతుంది. అలాగే వెల్లుల్లిలో ఉండే పోషకాలు కూడా నాశనం అయిపోతాయి. వెల్లుల్లిని పొట్టు తీయకుండా బయట వాతావరణం లోనే ఉంచితే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

ఉల్లిపాయ
ఉల్లిపాయలను ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలను ముక్కలుగా కోసి కంటైనర్ లో వేసి వారం అంతా సులువుగా వాడేందుకు ఇలా ఫ్రిజ్లో పెడుతూ ఉంటారు. ఇలా నిల్వ చేయడం వల్ల అవి విషపూరితంగా మారుతాయి. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉల్లిపాయలలోని పిండి పదార్థం చక్కెరగా మారిపోతుంది. దీనివల్ల ఆ ఉల్లిపాయలు తినడం ప్రమాదకరం. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ఇలాంటి ఫ్రిజ్ లో పెట్టిన ఉల్లిపాయలను తినకూడదు. వాటిని ఎల్లప్పుడూ చల్లని పొడిగా ఉండే చీకటి ప్రదేశంలోనే ఉంచాలి. ఎప్పటికప్పుడు ఉల్లిపాయలను కట్ చేసి వాడుకోవడమే ఉత్తమం.


అల్లం
అల్లాన్ని తాజాగా ఉంచేందుకు రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేసే వారి సంఖ్య ఎక్కువే. కానీ ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం అల్లాన్ని ఫ్రిజ్ లో పెట్టకూడదు. అల్లాన్ని పొడి వాతావరణంలో బయటే ఉంచాలి. అలా ఉంచితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఫ్రిజ్ లో పెడితే అల్లంలో ఫంగస్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఆ అల్లాన్ని తినడం వల్ల మూత్రపిండాలు, కాలేయానికి హాని కలుగుతుంది. కాబట్టి ఫ్రిజ్‌లో పెట్టిన అల్లాని వినియోగించవద్దు.

Also Read: స్మోకింగ్.. మానేయాలా? ఈ సింపుల్ ఫార్ములాను ప్రయత్నించండి, త్వరగా మానేస్తారు

వండిన అన్నం
కొంతమంది వండిన అన్నాన్ని కూడా ఫ్రిజ్‌లోనే పెడుతూ ఉంటారు. నిజానికి వండిన అన్నాన్ని 24 గంటలకు మించి రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేయకూడదు. అలా నిల్వ చేస్తే అది విషపూరితంగా మారుతుంది. అన్నాన్ని మళ్లీ వేడి చేసినప్పుడు అది పాయిజన్ సమ్మేళనాలలో కలిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అన్నాన్ని ఫ్రిజ్ లో నిలువ చేసేందుకు ప్రయత్నించవద్దు.

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×