BigTV English

OTT Movie : అక్క పెళ్లి చేసుకోవాలనుకునేవాన్ని తన్నుకుపోయే చెల్లి… ఇదెక్కడి రాక్షసిరా మావా

OTT Movie : అక్క పెళ్లి చేసుకోవాలనుకునేవాన్ని తన్నుకుపోయే చెల్లి… ఇదెక్కడి రాక్షసిరా మావా

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం డిజిటల్ మీడియా వైపు చూస్తున్నారు మూవీ లవర్స్. వీటిలో ఓటిటి ప్లాట్ ఫామ్ లో వచ్చే సినిమాలను ఎక్కువగా చూస్తున్నారు. అయితే వీటిలో కొన్ని సినిమాలు ఫ్యామిలీని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. మంచి స్టోరీ తో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక మూవీ ఓటిటి  ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘ఆచార్ & కో‘ (Achar & Co). 28 జూలై 2023లో విడుదలైన ఈ కామెడీ డ్రామా మూవీకి సింధు శ్రీనివాస మూర్తి దర్శకత్వం వహించారు. వంశీధర్ భోగరాజు, హర్షిల్ కౌశిక్, అనిరుధ్ ఆచార్య, జగదీశ్వర్ సుకుమార్ నటించారు. ఇది విమర్శకుల నుండి సానుకూల ప్రశంసలు పొందింది. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళ్ళితే

కుటుంబ పెద్ద అయిన మధుసూదన్ కి ముగ్గురు కొడుకులతోపాటు, ఏడుగురు అమ్మాయిలు ఉంటారు. వీళ్లందరిని మంచిగా చదివిస్తూ, తన కంట్రోల్లో పెట్టుకుని ఉంటాడు. పెద్దకొడుకుకి పెళ్లి వయసు రావడంతో, పావని అనే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ అమ్మాయి అందంగా లేకపోయినా, తండ్రి మాటను కాదనకకుండా పెళ్లి చేసుకుంటాడు. ఈ క్రమంలో చిన్నవాడైన రఘుకు కూడా పెళ్లి జరిపిస్తారు. అంతమంది ఉన్న ఇంట్లో ఉండటానికి వీళ్లిద్దరూ ఇబ్బంది పడుతుంటారు. ఇంద్ర, రఘు బయటికి వెళ్లి పోవాలి అనుకుంటారు. తండ్రితో ఇంద్ర ఈ మాట చెప్పగానే, మధుసూదన్ వీళ్ళపై కోప్పడతాడు. ఎప్పుడూ ఎదురు తిరగని ఇంద్ర, తండ్రిని దూషిస్తాడు. తన పిల్లలు ఇలా ఎదురు తిరగడాన్ని తట్టుకోలేక తండ్రి గుండెపోటుతో చనిపోతాడు. ఆ తర్వాత కుటుంబ బాధ్యత వీళ్ళిద్దరిపై పడుతుంది. ఇంద్ర ఒక డ్రామా కంపెనీలో పని చేస్తూ ఉంటాడు. రఘు కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. వీళ్ళిద్దరి సంపాదన కుటుంబ పోషణకి సరిపోకపోవడంతో, పెద్ద చెల్లి సుమని కూడా జాబ్ చేయమంటారు.

పెళ్లి చేసుకొని లండన్ వెళ్లాలనే కోరికను చంపుకుని, ఉద్యోగం చేయడానికి బయలుదేరుతుంది సుమ. ఒక స్కూల్ లో ఇంటర్వ్యూ కి వెళ్తుంది. అక్కడ ఆమె పదవ తరగతి ఫైల్ అవ్వడంతో టీచర్గా ఉద్యోగం ఇవ్వకుండా, నర్సరీలో పిల్లల్ని చూసుకునే ఉద్యోగం ఇస్తారు. పెద్ద చెల్లి సుమకి ఇంద్ర ఒక సంబంధం తీసుకొస్తాడు. ఆమె పదవ తరగతి ఫెయిల్ అయిందని తెలిసి, రెండవ చెల్లిని సెట్ చేసుకొని వెళతారు. ఇలా జరగడంతో సుమ చాలా బాధపడుతుంది. ఇలా సాగుతుండగా ఒక ప్రమాదంలో పెద్దకొడుకు ఇంద్ర కూడా చనిపోతాడు. చివరికి ఈ కుటుంబ పరిస్థితి ఏమవుతుంది? కుటుంబ బాధ్యతలను ఎవరు తీసుకుంటారు? సుమకి తన జీవితంలో ఎదురయ్యే సంఘటనలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘ఆచార్ & కో’ ఫ్యామిలీ డ్రామా మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×