E-Paper
Advertisement

పాకిస్తాన్ ప్లేయ‌ర్ తో SRH బౌల‌ర్ న‌ట‌రాజ‌న్‌ దోస్తానా..దేశం నుంచి త‌రిమేయాలంటూ ట్రోల్స్‌!

పాకిస్తాన్ ప్లేయ‌ర్ తో SRH బౌల‌ర్ న‌ట‌రాజ‌న్‌ దోస్తానా..దేశం నుంచి త‌రిమేయాలంటూ ట్రోల్స్‌!
Advertisement

Natarajan Ahmed Daniyal Chit Chat: భారత స్టార్ ఆటగాడు టీ.నటరాజన్ (Natarajan) సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ (Hong Kong Sixes 2026) సందర్భంగా పాకిస్తాన్ ఆటగాడితో మాట్లాడి అడ్డంగా దొరికిపోయాడు. పహ‌ల్గాం సంఘటన తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకూడదని బీసీసీఐ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినప్పటికీ.. నటరాజన్ బేఖాతరు చేసినట్టు తెలుస్తోంది. మ్యాచ్ జరుగుతుండగా పాకిస్తాన్ ఆటగాడి అహ్మద్ డేనియల్ (Ahmed Daniyal)తో టీ. నటరాజన్ క్లోజ్ గా కనిపించిన వీడియో వైర‌ల్ అయిన‌ నేపథ్యంలో అతనిపై దేశద్రోహి ముద్ర వేస్తూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్.

SRH బౌల‌ర్ న‌ట‌రాజ‌న్ అస‌లు వివాదం ఏంటి ?

హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ (Hong Kong Sixes 2026) లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్‌ మధ్య గ్రూప్ సీలో భాగంగా మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో అత్యంత దారుణమైన ఓటమి చవిచూసింది. అయితే మ్యాచ్ జరుగుతుండగా బ్యాటింగ్ కు వచ్చిన నటరాజన్ తో అహ్మద్ డేనియల్ చిట్ చాట్ చేశాడు. ఈ త‌రుణంలోనే పాకిస్తాన్ వాడికి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదన్న విషయాన్ని మర్చిపోయిన నటరాజన్… అతనితో ఫన్నీగా మాట్లాడాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు..అలాంటిది ఆ దేశ‌ బౌలర్ తో ఎలా మాట్లాడతావని నటరాజన్ ను నిలదీస్తున్నారు. ఇలాంటి క్రికెటర్లు దేశద్రోహులే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొంతమంది నటరాజన్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. కావాలనే అహ్మద్ డేనియ‌లే, నటరాజన్ ను రెచ్చగొట్టాడని… అందుకే వాడికి కౌంటర్ ఇచ్చే క్రమంలో రియాక్ట్ కావాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. ఇందులో టీ. న‌ట‌రాజ‌న్ త‌ప్పేం లేద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా

Advertisement

హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ లో (Hong Kong Sixes 2026)  భాగంగా జరిగిన మ్యాచ్ లో టీమిండియాపై ( Team India) పాకిస్తాన్ ( Pakistan Team) విజయం సాధించింది. శుక్ర‌వారం ఉదయం జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆరు ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో 5 వికెట్ల నష్టానికి 88 పరుగులు సాధించింది. లక్ష్యం చిన్నది కావడంతో పాకిస్తాన్ అవలీలగా 3.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి చేదించింది. దీంతో టీమిండియాపై నాలుగు వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది పాకిస్తాన్.

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

 

Related News

రాహుల్, కృనాల్ డకౌట్…పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోర ఓట‌మి

కాగితంపై రాసి పెట్టుకోండి..2027 వ‌రల్డ్ క‌ప్‌ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ తీసుకు వ‌స్తారు

Hong Kong Sixes 2026:  యూఏఈ చేతిలో పాకిస్తాన్ ఘోర‌ ఓట‌మి

అభిషేక్ శర్మ వ‌న్డేలు ఆడితే, 500 ప‌రుగులు ఈజీగా కొట్టేస్తాడు

అభిషేక్ శ‌ర్మ‌ను ‘స్లాగ‌ర్’ అన్న మ‌హ్మ‌ద్ అమీర్ రెండు చెంపలు వాయిస్తాం!

హెచ్ కోచ్ ప‌ద‌వి వ‌దిలేస్తే కోట్లు కుమ్మ‌రిస్తాం..గంభీర్ కు 4 ఐపీఎల్ జ‌ట్ల ఓన‌ర్ల ఆఫ‌ర్లు!

ప‌సికూన‌ల‌పై గెల‌వ‌డం కాదు, ద‌మ్ముంటే పాకిస్తాన్ ను ఓడించండి!

Big Stories

Advertisement
×