E-Paper
Advertisement

ఖాకీ చొక్కా వేసిన ఏజెంట్లకు బుద్ధి చెప్తాం.. పోలీసులకు జక్కంపూడి మాస్ వార్నింగ్

ఖాకీ చొక్కా వేసిన ఏజెంట్లకు బుద్ధి చెప్తాం.. పోలీసులకు జక్కంపూడి మాస్ వార్నింగ్
Advertisement

Jakkampudi Raja: కర్నూలులో వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా పోలీసుల తీరుపై ఆయన విరుచుకుపడ్డ విధానం చూస్తుంటే, వైకాపా శ్రేణుల్లో ఉన్న ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది.

రాజా మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో రాజ్యాంగం కాకుండా ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని ఎద్దేవా చేశారు. టీడీపీ ఏజెంట్లుగా మారి పనిచేస్తున్న ప్రతి పోలీస్ అధికారిపై తాము అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘ఖాకీ చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కడూ చట్టానికి లోబడి ఉండాలి.. అంతేకానీ టీడీపీ నేతలకు ఊడిగం చేస్తే మాత్రం ఊరుకోము’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రక్షక భటులే భక్షక భటులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి సీనియర్ నేతల ఇళ్లపై పెట్రోల్ బాంబు దాడులు జరిగితే, బాధితులైన వారిపైనే కేసులు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇది పక్కా రాజకీయ వేధింపులేనని కొట్టి పారేశారు. అలాగే ఒక మహిళా ఎస్సై పట్ల టీడీపీ నేతలు అమానవీయంగా ప్రవర్తిస్తే కనీసం చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.

ఇక కర్నూలు 3 టౌన్ సీఐ శేషయ్యపై రాజా నేరుగా నిప్పులు చెరిగారు. వైసీపీ కార్యకర్త బాలును అవమానించిన శేషయ్యను రేపు వైసీపీ ప్రభుత్వం రాగానే ఎవరు కాపాడతారని నిలదీశారు. ‘ఈరోజు మంత్రి భరత్ అండ చూసుకుని రెచ్చిపోతున్నావేమో.. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఇదే బాలు ఇంటి దగ్గర నువ్వు కాపలా కాయాల్సి ఉంటుంది’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గతంలో సీఐ శేషయ్య వైకాపా నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారని, ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి కార్యకర్తలను వేధిస్తున్నారని రాజా మండిపడ్డారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు జగనన్న అండగా ఉంటారని, ఎవరూ అధైర్యపడొద్దని ఆయన భరోసా ఇచ్చారు.

Advertisement

Also Read: భారీ అగ్నిప్రమాదం.. ఆసిఫ్ నగర్ ఫర్నీచర్ గోదాం దగ్ధం

Related News

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

నామినేషన్ల తొలిరోజు సీమలో టెన్షన్.. రాయచోటిలో టీడీపీ-వైసీపీ మధ్య దాడులు, తగలబెట్టిన కార్లు

Big Stories

Advertisement
×