BigTV English

Pawan Kalyan : ఎన్నికల ముందు కులగణన.. ఆ ప్రయోజనాల కోసమేనా..?

Pawan Kalyan : ఎన్నికల వేళ రాష్ట్రంలో కులగణన ఎందుకని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం కులగణన చేపట్టాలన్న నిర్ణయం వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు ఆయన సామాజిక మాధ్యమంలో లేఖను విడుదల చేశారు.

Pawan Kalyan : ఎన్నికల ముందు కులగణన.. ఆ ప్రయోజనాల కోసమేనా..?
Pawan Kalyan Janasena news

Pawan Kalyan Janasena news(AP politics):

ఎన్నికల వేళ రాష్ట్రంలో కులగణన ఎందుకని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం కులగణన చేపట్టాలన్న నిర్ణయం వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు ఆయన సామాజిక మాధ్యమంలో లేఖను విడుదల చేశారు.


ఎన్నికల ముందే కులగణన ఉద్దేశం ఎందుకు వచ్చిందని వవన్ కళ్యాన్ ప్రశ్నించారు. అందుకు కారణాలు వివరిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఎందుకు విడుదల చేయలేదన్నారు. ఇది ఆర్టికల్‌ 21 ప్రకారం వ్యక్తిగత గోప్యత, భద్రత, స్వేచ్ఛను హరించడం అవుతుందన్నారు. కులగణన ప్రభుత్వ ఉద్దేశం అయితే.. ఉపకులం, ఆదాయం, భూములు, మేకలు, కోళ్లు, ఆవులు, గేదెల వివరాలన్నీ ఎందుకు? అడుగుతున్నారని ప్రశ్నించారు.

బిహార్‌ ప్రభుత్వం చేసిన కులగణనపై సుప్రీంకోర్టులో కేసు ఉందన్నారు. తీర్పు రాకముందే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటని పవన్ ప్రశ్నించారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. దీని వల్ల ప్రజాధనం వృధా అయ్యే అవకాశం ఉందన్నారు. కులగణన ప్రక్రియను ఎంతో మంది నిపుణులతో చేయాల్సి ఉంటుందన్నారు. కులగణన చేసే వాలంటీర్లకు ఆ అర్హత, సామర్థ్యాలు ఉన్నాయని ఎలా నిర్ధారించారని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


ప్రజల నుంచి డేటా సమ్మతి అనేది ఎలా తీసుకుంటారో చెప్పాలని ప్రభుత్వాన్ని పవన్ ప్రశ్నించారు. అనవసరంగా ప్రభుత్వ వనరులు, యంత్రాంగాన్ని స్వీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్నారు.ఇది ప్రజా ధనాన్ని వృధా చేయడానికే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. దేశ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఇది తూట్లు పొడవడమేనన్నారు. వాలంటీర్ల ద్వారా వైసీపీ ప్రభుత్వం సేకరిస్తున్న కులగణన, ఇతర వివరాలను ఏ కంపెనీలో భద్రపరుస్తారనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్ కళ్యాన్ డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలపై రాజకీయంగానే న్యాయపరమైన మార్గాలను కూడా ఆలోచిస్తామని ఆయన పేర్కొన్నారు.

Related News

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

Big Stories

×