Big Stories

Man Voted with Buffalo: దున్నపోతుపై వచ్చి తన తొలిసారి ఓటును వినియోగించుకున్న యువకుడు.. వీడియో వైరల్!

Young Man Came Polling booth on Buffalo to Caste His First Vote in Bihar:  పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పలు చోట్లా వింత వింత సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నాలుగో దఫా పార్లమెంటు ఎన్నికల్లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది.

- Advertisement -

ఓ యువకుడికి ఓటు హక్కు వచ్చింది. తాను మొదటిసారిగా ఓటు వేస్తున్నందుకు ఆనందంతో  దున్నపోతుపై వచ్చి ఓటు వేశాడు. తొలిసారిగా ఓటు వేస్తున్నానని, అది ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఇలా దున్నపోతుపై వచ్చి ఓటు వేశానని ఆ యువకుడు చెప్పడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. అంతేకాదు.. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది.

- Advertisement -

పార్లమెంటు నాలుగో దఫా ఎన్నికల్లో భాగంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. బీహార్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగాయి. అయితే, బీహార్ రాష్ట్రంలోని నమస్తిపూర్ జిల్లాలోని ఉజియార్ పూర్ లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఉజియార్ పూర్ నియోజకవర్గానికి చెందిన ఓ యువకుడికి ఇటీవలే ఓటు హక్కు వచ్చింది. అయితే, ఆ యువకుడు నల్ల చొక్కా, గ్రే కలర్ ప్యాంట్ ధరించాడు. ఆ తరువాత ఆకుపచ్చ తలపాగా చుట్టి దున్నపోతుపై పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాడు. ఆ తరువాత ఓటు వేశాడు. అంతేకాదు.. ఆ దున్నపోతుకు కూడా ఆకుపచ్చ తలపాగా చుట్టాడు.

Also Read: ప్రధాని మోదీ ఎన్నికల అఫిడవిట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఇలా దున్నపోతుపై పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆ యువకుడిని అందరూ వింతగా చూశారు. ఎందుకిలా వచ్చావు అని అడుగగా, అతను చెప్పిన సమాధానం విని అంతా ఆశ్చర్యపోయారంటా. తనకు మొదటిసారిగా ఓటు హక్కు వచ్చిందని.. తాను మొదటిసారిగా ఓటుహక్కును వినియోగించుకుంటున్నానని, అది తనకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండేందుకు ఇలా తాను దున్నపోతుపై వచ్చినట్లు చెప్పడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారంటా.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

అయితే, బీహార్ రాష్ట్రంలోని నమస్తిపూర్ జిల్లాలోని ఉజియార్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి మొత్తం 13 మంది అభ్యర్థులు పోటీ చేశారు.అందులో పలువురు ప్రముఖులు ఉన్నారు. ఈ లోక్ సభ నియోజకవర్గంలో మొత్తం 17.48 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఈ యువకుడు కూడా అందులో ఒక ఓటరు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News