BigTV English

Pawan Delhi Tour Break: ఢిల్లీ పర్యటనకు పవన్ బ్రేక్.. పొత్తు ఖాయమైనట్టా..? లేనట్టా..?

Pawan Delhi Tour Break: ఢిల్లీ పర్యటనకు పవన్ బ్రేక్.. పొత్తు ఖాయమైనట్టా..? లేనట్టా..?

Pawan Delhi Tour Cancelled: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయాలు మరింత హీట్ ఎక్కుతున్నాయి. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా జనసేన, టీడీపీ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. కానీ పొత్తులు, సీట్ల సర్దుబాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా ? లేదా ? అనే అంశంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. టీడీపీతో పొత్తు ఉంటుందనే బీజేపీ జాతీయ నాయకత్వం సంకేతాలు ఇస్తుంది. సీట్ల సర్దుబాటు వ్యవహారంపై స్పష్టత వచ్చిన తర్వాతే పొత్తులపై క్లారిటీ వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ కూడా హస్తిన వెళ్లి.. బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చిస్తారని ప్రచారం జరిగింది. కానీ తాజాగా పవన్ ఢిల్లీ పర్యటనకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.


పవన్ కళ్యాణ్‌ ఢిల్లీ పర్యటనకు బ్రేక్ పడటంతో… ఆయన విజయవాడ వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అవుతారని భావిస్తున్నారు. బీజేపీతో పొత్తు, సీట్ల పంపకం అంశంపై చంద్రబాబుతో.. పవన్ మంతనాలు జరుపుతారని సమాచారం. జనసేనకు మెజార్టీ సీట్లు కేటాయించాలని పవన్ ను.. నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటి వరకు పొత్తులో భాగంగా జనసేనకు 25 నుంచి 27 అసెంబ్లీ, మూడు ఎంపీ స్థానాలు ఖాయమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సంఖ్యతో జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు సుముఖంగా లేరు. టీడీపీకి పూర్తిగా సహకరిస్తున్న తమకు కనీసం 40 స్థానాలు కావాలని జనసేన నేతలు పట్టు బడుతున్నారు.

Read More : ‘మహా స్వాప్నికుడు’ చంద్రబాబు.. బుక్ రిలీజ్ చేసిన రిటైర్డ్ జస్టిస్..


ఈ క్రమంలోనే పొత్తుల విషయంలో ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పవన్ జనసేన శ్రేణులకు సూచించారు. ఈ సమయంలోనే బీజేపీతో పొత్తు ఖాయమైనట్లు తెలుస్తుండగా.. బీజేపీ నుంచి 25 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలు కోరినట్లు ప్రతిపాదన వచ్చిందని పార్టీ వర్గాలలో చర్చించుకుంటున్నారు. చంద్రబాబు తన పార్టీ ముఖ్యులతో చర్చ అనంతరం.. జనసేన, బీజేపీ లకు కలిపి కు 40 అసెంబ్లీ, 9 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి బీజేపీకి తమ ప్రతిపాదనలను పంపినట్లు విశ్వస నీయ సమాచారం.

Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×