BigTV English

Maha Swapnikudu Book On Chandrababu: ‘మహా స్వాప్నికుడు’ చంద్రబాబు.. బుక్ రిలీజ్ చేసిన రిటైర్డ్ జస్టిస్..

Maha Swapnikudu Book On Chandrababu: ‘మహా స్వాప్నికుడు’ చంద్రబాబు.. బుక్ రిలీజ్ చేసిన రిటైర్డ్ జస్టిస్..
Maha Swapnikudu Book On Chandrababu

Maha Swapnikudu Book On Chandrababu: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై రాసిన మహా స్వాప్నికుడు పుస్తకాన్ని రిటైర్డ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గోపాల గౌడ ఆవిష్కరించారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పూల విక్రమ్ దీనిని రచించారు. వెంకట్ కోడూరి ఈ పుస్తకాన్ని ప్రచురించారు. వెంకట్ ప్రస్తుతం కువైట్‌లో స్ధిరపడ్డారు.


సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన చంద్రబాబు బాల్యంతో ఈ పుస్తకం ప్రారంభమవుతుంది. చంద్రబాబు పట్టుదల, ఆయన చేసిన కృషి, ఆయన ఎదిగిన తీరును ఈ పుస్తకంలో వివరించారు రచయిత విక్రమ్. తన దార్శనికతతో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి రాష్ట్రానికి చంద్రబాబు నిర్దేశించిన తీరును వాస్తవాలకు దగ్గరగా ఈ పుస్తకంలో పొందుపరిచారు. రాజకీయాలలో చంద్రబాబుపై కక్షసాధింపు చర్యలకు పాల్పడిన ప్రస్తుత ఏపీ సీఎం జగన్ గురించి, ఆయన ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుల గురించి ప్రత్యేకంగా వివరించారు రచయిత పూల విక్రమ్.

Read More: ఎన్నికల ప్రచారానికి పవన్ రెడీ.. మూడు దశల్లో జనసేన యాక్షన్ ప్లాన్!


ప్రభుత్వం పెట్టిన కేసులును చంద్రబాబు ఎలా ఎదుర్కున్నారో ఇందులే పేర్కొన్నారు. 53 రోజుల పాటు జైల్లో పెట్టినా వెన్నక్కుతగ్గని ఆయన మొక్కవోని దీక్ష గురించి ప్రత్యేకంగా తెలిపారు. రాజకీయంగా చంద్రబాబును ఢీకొనలేక విషం జిమ్ముతున్న ప్రత్యర్ధులపై ఒక ప్రత్యేక ఛాప్టర్‌ను రూపొందించారు. ఆయన వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా పొందుపరిచారు.

రాజధాని అంశాన్ని ఈ పుస్తకంలో ప్రత్యేకంగా స్పృశించారు రచయిత పూల విక్రమ్. 20 ఏళ్ల క్రితమే విజన్ 2020 పేరుతో తన కున్న దార్శనికతనతో చంద్రబాబు రాజధాని నగరాలను ఎలా అభివృద్ధి పదంలో నడిపారనే ప్రస్థావన తీసుకొచ్చారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ నేతలు టీడీ జనార్ధన్, నన్నపనేని రాజకుమారి, నెట్టెం రఘురాం తదితరులు పాల్గొన్నారు.

Tags

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×