BigTV English

Valentine Week Special – Hug Day: ‘హ్యాపీ హగ్ డే’.. వీలైతే ఒక్క హగ్ ఇవ్వండి డ్యూడ్!

Valentine Week Special – Hug Day: ‘హ్యాపీ హగ్ డే’.. వీలైతే ఒక్క హగ్ ఇవ్వండి డ్యూడ్!
Happy Hug Day 2024

Valentine Week Special Happy Hug Day 2024: వాలెంటైన్ వీక్‌లో హగ్ డే ఎంతో ప్రత్యేకమైనది. ఈ వీక్‌లో ప్రేమికుల మరెంతో ప్రేమగా,ఉత్సాహంగా ఉంటారు. హగ్ డే ని ఫిబ్రవరి 12న సెలబ్రేట్ చేసుకుంటారు. మనకు ప్రియమైన వారిని హగ్ చేసుకంటే వచ్చే ఫీల్ చెప్పలేని అనుభూతిని ఇస్తుంది.


ఏదైనా సమస్యతో బాధపడేవారికి హగ్ ఇస్తే వారు ఆ సమస్య నుంచి బయటపడతారు. హగ్‌కి అంత పవర్ ఉంది మరి. ఇక లేట్ చేయకుండా హగ్ డే రోజున కౌగిలింతల వర్షం కురిపించండి. వీలైతే ఒక్క హగ్ ఇవ్వండి డ్యూడ్ పోయేదేముంది..!

ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం ఉంటుంది..


  • ఇద్దరు స్నేహితుల మధ్య హగ్.. ఒక ఓదార్పు, ఆప్యాయ పలకరింతలాంటిది.
  • అమ్మాయిలు.. అబ్బాయి గుండెలపై వాలిపోతూ హగ్ చేసుకుంటే వారు మిమ్మల్ని మిస్ అవుతున్నారని..
  • ఒక మనిషి మనకు తోడుగా ఉన్నాడనే ఫీలింగ్ కేవలం హగ్‌తోనే వస్తుంది.
  • మిమ్మల్ని ఎవరైనా గట్టిగా హత్తుకుని ఉండిపోతే.. వారు మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతున్నారని అర్థం.
  • హగ్ చేసుకున్నప్పుడు థైమస్ గ్రంథి ఉత్తేజానికి గురవ్వుతుంది.

మనం ప్రేమించే వ్యక్తికి మన ప్రేమను తెలియజేసే విధానాల్లో హగ్ కూడా ఒకటి. అంతే కాదు.. మనం ప్రేమించే వారికి హగ్ చేసుకోవడం వల్ల మనలో ఒత్తిడి తగ్గి రిలాక్స్ అవుతాము. ప్రశాంతత లభిస్తుంది.

Read More: మీ లవర్‌కి ఇలా ప్రామిస్ చేయండి..!

ఆనందంగా ఉన్నప్పుడే కాదు.. బాధలోనూ ఒక హగ్ ఓదార్పును ఇస్తుంది. ఈ విషయం అనేక అధ్యయనాల్లో కూడా తేలింది. హగ్ అనేది కేవలం ప్రేమికులకు మాత్రమే పరిమితం కాదు. తల్లిదండ్రులకు, స్నేహితులకు, పిల్లలు కూడా హగ్ చేసుకోవచ్చు.

ఒక హగ్‌తో మీ మనసులోని భావాలను ఎదుటి వారికి తెలియజేయవచ్చు. హగ్ అనేది మీ సంబంధాలను కూడా బలపరుస్తుంది. కాబట్టి హగ్ డే రోజును మీ ప్రేమను ఒక హగ్‌తో మీ భాగస్వామికి చేప్పేయండి.

ఇద్దరు స్నేహితులు లేదా ఆత్మీయులు మధ్య హగ్ అనేది భరోసాను ఇస్తుంది. అయితే కొందరు హగ్‌ను తప్పుగా భావిస్తుంటారు. అటువంటి ఆ భావన అనేది చాలా పెద్ద పొరపాటు.

Read More: వాలెంటైన్స్ డే వెనుక క్రూరమైన చరిత్ర..!

హగ్ చేసుకునే ముందు వారి అనుమతి కచ్చితంగా పొందాలి లేదంటే.. లైంగిక వేధింపుల కింది పరిగణించవచ్చు. కాబట్టి హగ్ విషయంలో ఎవరైనా దూరంగా ఉంటే వారి అభిప్రాయాన్ని గౌరవించండి. హగ్ అనేది ఇద్దరి మధ్యన ఉన్న ప్రేమ లేదా స్నేహం ఆధారంగా ఉంటుంది. వ్యక్తుల మధ్య ఉండే బంధాలును బట్టి.. హగ్‌కు అర్థాలు మారిపోతుంటాయి.

Tags

Related News

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Big Stories

×