BigTV English

Mudragada Padmanabham : మరోసారి ముద్రగడతో జనసేన చర్చలు.. ఆ రోజు కిర్లంపూడికి పవన్ కల్యాణ్..!

Mudragada Padmanabham : మరోసారి ముద్రగడతో జనసేన చర్చలు.. ఆ రోజు కిర్లంపూడికి పవన్ కల్యాణ్..!

Mudragada Padmanabham : ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలపై వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో కీలక నేతలకు గాలం వేస్తున్నాయి. కుల సమీకరణాలు ఆధారంగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ నేతలు చక్కర్లు కొడుతున్నారు.


కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడ తొలుత వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. ఇదే సమయంలో టీడీపీ-జనసేన నేతలు పావులు కదిపారు. జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ రెండు రోజుల క్రితం ముద్రగడను కలిశారు. ఆయనతో చర్చలు జరిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పంపిన సందేశాన్ని ఆయనకు వివరించారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడ ఇంటికి వెళ్లడం ఆసక్తిగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు దూతగానే జ్యోతుల నెహ్రూ.. ముద్రగడ ఇంటికి వచ్చారనే చర్చ జరిగింది.

తాజాగా జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి ముద్రగడను కలవడం ఆసక్తికరంగా మారింది. పవన్ నే స్వయంగా కిర్లంపూడి వచ్చి ముద్రగడను కలుస్తారనే బొలిశెట్టి వెల్లడించారు. ఈ నెల 20 లేదా 23న ముద్రగడతో పవన్ కల్యాణ్ భేటీ అవుతారని తెలిపారు.


Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×