BigTV English

Brazil Deforestation : బ్రెజిల్‌లో 50% తగ్గిన అటవీ క్షీణత..!

Brazil Deforestation : బ్రెజిల్‌లో 50% తగ్గిన అటవీ క్షీణత..!
Deforestation in Brazil

Brazil Deforestation : బ్రెజిల్‌లో అమెజాన్ అడవుల నరికివేత గణనీయంగా తగ్గింది. 2022తో పోలిస్తే నిరుడు సగానికి సగం తగ్గినట్టు నేషనల్ స్పేస్ ఏజెన్సీ డేటా చెబుతోంది. గత ఐదేళ్లలో డీఫారెస్టేషన్ రేటు ఇదే అతి తక్కువని బ్రెజిల్ వెల్లడించింది. అయినా నరికివేతకు గురైన అటవీ విస్తీర్ణం న్యూయార్క్ సిటీ కన్నా ఆరు రెట్లు ఎక్కువ.


నేషనల్ స్పేస్ ఏజెన్సీ ప్రాథమిక డేటా ప్రకారం 2023లో 5,153 చదరపు కిలోమీటర్ల మేర అమెజాన్ అటవీ క్షీణత చోటుచేసుకుంది. 2022లో ఈ విస్తీర్ణం 10,278 చదరపు కిలోమీటర్ల వరకు ఉంది. నిరుడు అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన బోల్సొనారో హయాంలోనే అత్యధికంగా అమెజాన్ వర్షారణ్యాలు నరికివేతకు గురయ్యాయి. 2030 కల్లా డీఫారెస్టేషన్ అన్నదే లేకుండా చూస్తామని ప్రస్తుత అధ్యక్షుడు లూలా డి సిల్వా ప్రతినబూనారు.

జీరో డీఫారెస్టేషన్ రేటును సాధించడం తొలి లక్ష్యమని కొత్త ప్రభుత్వం చెబుతోంది. అమెజాన్ అడవులు ప్రపంచానికే ఆయువుపట్టులాంటివి. భూమ్మీద మొత్తం ఆక్సిజన్‌లో ఐదోవంతు అమెజాన్ అరణ్యాలే అందిస్తున్నాయి. The Lungs of the Earth గా పేరున్న ఈ అడవులు 55 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తరించాయి. ఇందులో 60 శాతం మేర అటవీ ప్రాంతం బ్రెజిల్‌లోనే ఉంది.


Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×