BigTV English

Jacinda Ardern | బిడ్డను కని.. బాయ్‌ఫ్రెండ్‌నే పెళ్లాడిన న్యూజిలాండ్ ప్రధాని!

Jacinda Ardern | న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డ్రెన్ .. దాదాపు నాలుగు సంవత్సరాలపాటు సహజీవనం చేసిన బాయ్ ఫ్రెండ్‌ క్లార్క్ గేఫార్డ్‌ని శనివారం పెళ్లి చేసుకున్నారు. రాజధాని వెల్లింగ్ టన్‌కు దాదాపు 310 కిలోమీటర్ల దూరంలో నార్త్ ఐలాండ్‌లో దాదాపు 75 అతిథుల మధ్య వివాహ వేడుకులు జరిగాయి.

Jacinda Ardern | బిడ్డను కని.. బాయ్‌ఫ్రెండ్‌నే పెళ్లాడిన న్యూజిలాండ్ ప్రధాని!

Jacinda Ardern | న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డ్రెన్ .. దాదాపు నాలుగు సంవత్సరాలపాటు సహజీవనం చేసిన బాయ్ ఫ్రెండ్‌ క్లార్క్ గేఫార్డ్‌ని శనివారం పెళ్లి చేసుకున్నారు. రాజధాని వెల్లింగ్ టన్‌కు దాదాపు 310 కిలోమీటర్ల దూరంలో నార్త్ ఐలాండ్‌లో దాదాపు 75 అతిథుల మధ్య వివాహ వేడుకులు జరిగాయి. అతిథులలో న్యూజిలాండ్ తదుపరి ప్రధాన మంత్రి క్రిస్ హాప్‌కిన్స్ కూడా ఉండడం విశేషం. జెసిండా తన రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ ప్రతిపక్ష నేత హాప్‌కిన్స్ ఆమె వివాహానికి హాజరయ్యారు.


వీరిద్దరికీ 2019 మే నెలలో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తరువాత 2022లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ తాను స్వయంగా విధించిన కరోనా నిబంధనల కారణంగా ఆమె వివాహం వాయిదా వేసుకున్నారు.

43 ఏళ్ల జెసిండా ఆర్డ్రెన్ ప్రపంచ వ్యాప్తంగా ఒక మహిళా రాజకీయనేతగా బాగా ఫేమస్. ఆమె ప్రియుడు క్లార్క్ గేఫార్డ్‌(47) ఒక న్యూస్ యాంకర్. పెళ్లికి ముందే జెసిండా, క్లార్క్ ప్రేమకు చిహ్నంగా వీరికి అయిదేళ్ల పాప ఉంది. ఒకసారి ప్రధాని జెసిండా తన కూతురిని తీసుకొని ఐక్యరాజ్య సమితి సమావేశానికి కూడా వెళ్లింది.


ఇటీవలే జెసిండా న్యూజిలండ్ పార్లమెంట్‌లో తన చివరిసారి ప్రసంగం చేశారు. చివరి ప్రసంగం చేస్తూనే.. ఆమె తన బాయ్ ఫ్రెండ్ క్లార్క్‌కు పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేసింది. ఇది నేషనల్ టీవీలో ప్రసారం అయింది.

Tags

Related News

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Donald Trump: టాలీవుడ్‌కు ట్రంప్ షాక్.. ఇక అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ కష్టమేనా?

Pakistan: మీ పాలన మాకొద్దు.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర ఉద్రికత్త

America: అమెరికాలోని మిషిగాన్‌లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి, మరో 9 మందికి గాయాలు..

Big Stories

×