
JC Prabhakar Reddy vs Kethireddy(Political news in AP): ధర్మవరంలో కొన్నిరోజులు పొలిటికల్ వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఒకరిపై మరొకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎమ్మెల్యే కేతిరెడ్డికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మీ కుటుంబం ఎలా బతికిందో తాను చెబుతానన్నారు. జేసీని చెప్పుతో కొడతానన్న ఎమ్మెల్యే కామెంట్లపై ఘాటుగా రిఫ్లై ఇచ్చారు. కొట్టేందుకు రావాలని సవాల్ విసిరారు.
ఇటీవల ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పెద్దారెడ్డిలపై జేసీ ప్రభాకర్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో వెంకట్రామిరెడ్డి తీవ్రంగా స్పందించారు. చెప్పుతో కొడతామంటూ ఘాటుగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి స్పందించారు. కేతిరెడ్డి వాళ్ల తాత చనిపోతే శవాన్ని తీసుకెళ్లే ధైర్యం చేయలేకపోయారని విమర్శించారు. చల్లా సుబ్బరాయుడు సహాయం చేయకపోతే శవాన్ని తీసుకెళ్లలేని పరిస్థితిలో ఉన్నారని గుర్తు చేశారు.కేతిరెడ్డి వాళ్ల చిన్నాన్న పెద్దారెడ్డి పేద రైతులకు దక్కాల్సిన పంటల బీమా సొమ్మును కొట్టేశారని మరోసారి ఆరోపించారు. వెళ్లి ఆయనను చెప్పుతో కొట్టాలని సవాల్ చేశారు.
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లండన్ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేశారని జేసీ అన్నారు. కానీ ఇక్కడ గొప్పలు చెబుతున్నారని సెటైర్లు వేశారు. ఇప్పటికే ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల నుంచి కేతిరెడ్డి ఫ్యామిలీ బాధితులు ఆధారాలు ఇస్తామంటూ ఫోన్లు చేస్తున్నారని తెలిపారు.