Voltas Beko 8 place settings dishwasher: ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్న వారికి కిచెన్ పనులు ఒక పెద్ద టాస్క్‌లా మారుతున్నాయి. ముఖ్యంగా.. భోజనం అయిన తర్వాత సింక్‌లో పేరుకుపోయే జిడ్డు గిన్నెలను శుభ్రం చేయడం ఎవరికైనా చిరాకు తెప్పించే పనే. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రముఖ బ్రాండ్ టాటా, వోల్టాస్ సంయుక్తంగా అందించిన ‘వోల్టాస్ బేకో DT8S ఫ్రీ స్టాండింగ్ 8 ప్లేస్ సెట్టింగ్స్ డిష్ వాషర్’ ప్రస్తుతం మార్కెట్లో విపరీతమైన ట్రెండ్ సృష్టిస్తోంది. సామాన్యుల బడ్జెట్‌లో లభిస్తున్న ఈ డిష్ వాషర్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ డిష్ వాషర్ స్పెషల్ అట్రాక్షన్ డిజైన్ , కెపాసిటీ. మన ఇళ్లలో ఉండే కప్పులు, గ్లాసులు, చిన్న గిన్నెలు , పెద్ద కర్రీ బౌల్స్ వంటి వాటిని ఈజీగా సర్దుకోవడానికి వీలుగా 8 ప్లేస్ సెట్టింగ్స్ కెపాసిటీతో ఇది వస్తుంది. 2 నుంచి 4 మంది ఉండే చిన్న కుటుంబాల లేదా బ్యాచిలర్స్ అవసరాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వంట గదిలో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించకుండా.. చిన్న స్పేస్‌లో కూడా దీన్ని ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
మన వంటకాల్లో నూనె, మసాలాలు ఎక్కువగా వాడతాం కాబట్టి గిన్నెలపై జిడ్డు మరకలు తొలగించడం చాలా కష్టం. అయితే వోల్టాస్ బేకో డిష్ వాషర్‌లో ఉన్న ప్రత్యేకమైన వాష్ ప్రోగ్రామ్స్ ఈ సమస్యను చిటికెలో పరిష్కరిస్తాయి. వేడి నీటిత గిన్నెలను శుభ్రపరిచే టెక్నాలజీ ఇందులో ఉండటం వల్ల, జిడ్డు పూర్తిగా వదిలిపోవడంతో పాటు గిన్నెలు బ్యాక్టీరియా లేకుండా పూర్తిగా హైజెనిక్‌గా మారుతాయి. చేతులతో కడిగితే వచ్చే శుభ్రత కంటే రెట్టింపు మెరుపు ఇందులో కనిపిస్తుంది.
ఇది ఒక ఫ్రీ స్టాండింగ్ మోడల్ కాబట్టి, వంటగదిలో ఎక్కడైనా అనుకూలమైన చోట దీన్ని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. దీనికి పెద్దగా ప్రత్యేక ఏర్పాట్లు ఏవీ అవసరం లేదు. డిజిటల్ డిస్‌ప్లే ,ఈజీ-టు-యూజ్ కంట్రోల్ ప్యానెల్ ఉండటం వల్ల ఇంట్లోని పెద్దవాళ్ళు లేదా పనిచేసే మనుషులు కూడా దీన్ని చాలా ఈజీగా ఆపరేట్ చేయవచ్చు. తక్కువ నీరు, తక్కువ కరెంట్ ఖర్చుతో పని చేసేలా దీన్ని డిజైన్ చేయడం మరో పెద్ద ప్లస్ పాయింట్.
Also Read: రూ.26,790 ధరకే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్, డోంట్ మిస్
మార్కెట్లో డిష్ వాషర్ అనగానే వేల రూపాయలు ఖర్చు పెట్టాలని భయపడుతుంటారు. కానీ టాటా వారి నమ్మకంతో.. వస్తున్న ఈ వోల్టాస్ బేకో డిష్ వాషర్ ధర కేవలం రూ.17,990 మాత్రమే ఉండటం విశేషం. మిడిల్ క్లాస్ కుటుంబాల బడ్జెట్‌కు ఏ మాత్రం భారం కాకుండా.. లగ్జరీ లైఫ్‌స్టైల్ ఫీల్ ఇది అందిస్తుంది. దీని ద్వారా గిన్నెలు కడిగే సమయం కూడా భారీగా ఆదా అవుతుంది.
రోజూ గిన్నెలు కడగటానికి టైం వృధా కావడాన్ని ఆపాలనుకుంటే.. వోల్టాస్ బేకో DT8S డిష్ వాషర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నమ్మకమైన బ్రాండ్, తక్కువ ధర , అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కోరుకునే ప్రతీ ఒక్కరూ ఈ గ్యాడ్జెట్‌ను ఇంటికి తెచ్చుకోవచ్చు.