E-Paper
Advertisement

అర్వింద్ మాట‌ల దాడిపై అన్న సంజయ్ తో ఎదురుదాడి… రోగానికి త‌గ్గ మందు ఇదేనంటున్న టీపీసీసీ చీఫ్‌!

అర్వింద్ మాట‌ల దాడిపై అన్న సంజయ్ తో ఎదురుదాడి… రోగానికి త‌గ్గ మందు ఇదేనంటున్న టీపీసీసీ చీఫ్‌!
Advertisement

అర్వింద్ నోటి దురుసు మాట‌ల‌ను త‌ట్టుకోలేక‌పోతోంది అధికార పార్టీ. మిగిలిన బీజేపీ నేత‌ల‌కు భిన్నంగా మరీ దిగ‌జారిన పొలిటిక‌ల్ కామెంట్స్ చేస్తున్నాడు అర్వింద్‌. బాడీ షేమింగ్ కామెంట్స్‌కు లెక్కే లేదు. సీఎం రేవంత్‌రెడ్డిని సైతం దీనికి మిన‌హాయింపు ఇవ్వ‌డం లేదు. పీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్‌ను కూడా ఈ మ‌ధ్య టార్గెట్ చేసి మాట్లాడుతూ వైర‌ల్ వార్త‌ల్లో నిలుస్తున్నాడు అర్వింద్‌.

నిజామాబాద్ .. పీసీసీ చీఫ్ ఇలాఖా కావ‌డం, అర్వింద్‌.. దివంగ‌త డీఎస్ త‌న‌యుడు కావ‌డంతో .. అంతే ఘాటుగా కాంగ్రెస్ నుంచి ప్ర‌తి స్పంద‌న రావ‌డం లేదు. దీంతో మ‌రింత రెచ్చిపోతున్నాడు అర్వింద్. అయితే అర్వింద్ నోటికి తాళం వేయాలంటే, తిట్ల‌కు, బూతు పురాణాల‌కు బ్రేక్ వేయాలంటే అత‌ని అన్న సంజ‌యే క‌రెక్ట‌నే ఆలోచ‌న‌కు వచ్చాడు పీసీసీ చీఫ్.

Advertisement

మాజీ మేయ‌ర్ అయిన సంజ‌య్ గ‌త కొంత‌కాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నాడు. తండ్రి మ‌ర‌ణానంతం త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నాడు. ఇటీవ‌ల త‌ను పార్టీ వీడుతాన‌నే సంకేతం కూడా ఇచ్చాడు. కానీ ఇంకా కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతున్నాడు. గ‌తంలో డీఎస్‌తో క‌లిసి బీఆరెస్ పార్టీలో చేరినా.. అక్క‌డా పెద్దగా ప్ర‌యార్టీ ఇవ్వ‌లేదు సంజ‌య్‌కు. దీంతో మ‌ళ్లీ కాంగ్రెస్‌లో పార్టీలోనే కొన‌సాగుతూ వ‌స్తున్నాడు.

అయితే ఇటీవ‌ల అర్వింద్ ప‌రుష‌ ప‌దాల‌తో పీసీసీ చీఫ్‌ను, సీఎంను విమ‌ర్శించే దోర‌ణి పెరిగింది. రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌తో స‌రిపెట్ట‌కుండా ప‌ర్స‌న‌ల్ టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. దీనికి ఘాటుగా కౌంట‌ర్లు ఇవ్వ‌డం ఎవ‌రి త‌రం కావ‌డం లేదు. దీంతో మ‌హేశ్‌.. సంజ‌య్‌ను రంగంలోకి దింప‌డ‌మే క‌రెక్ట‌ని భావించిన‌ట్టున్నారు.

Advertisement

ఇప్పుడు సంజ‌య్.. అర్వింద్‌ను కార్న‌ర్ చేసి కామెంట్లు చేస్తున్నాడు. అస‌లు అర్వింద్ మాట‌ల‌పై ఆ పార్టీ నేత‌లే విసుగు చెందార‌ని, తిట్టుకుంటున్నార‌ని ఉల్టా మాట‌ల దాడికి దిగ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గ‌తంలో అడ‌పాద‌డ‌పా.. సంజ‌య్ త‌న త‌మ్ముడు అర్వింద్‌ను విమ‌ర్శించినా.. ఇక‌పై మ‌రింత పదునైన మాట‌ల దాడి ఉడ‌నుంద‌నే సంకేతాలు ఇస్తున్నాడు.

కాంగ్రెస్ పార్టీ త‌న తండ్రికి గౌర‌వ‌మిచ్చి క‌నీసం త‌న‌కు ఏదైనా ప‌దవి ఇస్తుంద‌ని చాలా కాలం ఎదురుచూశాడు సంజ‌య్‌. కానీ మ‌హేశ్ ఆయ‌న‌ను లైట్ తీసుకున్నాడు. దీంతో పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వస్తున్న సంజ‌య్‌.. ఇప్పుడు పార్టీకి అవ‌స‌రం ప‌డిన‌ట్టున్నాడు. త‌మ్ముడి నోటికి తాళం వేయాలంటే అన్నే క‌రెక్టు అనే భావ‌న‌కు వ‌చ్చిన‌ట్టుగా తెలుస్తోంది. మ‌రి సంజ‌య్ ఆశించిన‌ట్టుగా ఏదైనా ప‌ద‌వి ఇస్తారా? అనే చ‌ర్చ కూడా న‌డుస్తోంది.

Tags

Related News

చంద్రుడిపై ఐదు మెరుపులు.. ఆర్టెమిస్-2 వ్యోమగాములు గుర్తించిన వింత ఏంటి?

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేది ఆ నలుగురే.. ఢిల్లీ వేదికగా రాహుల్ గాంధీ కొత్త నినాదం!

విశాఖ నావికాదళంపై పాక్ కన్ను.. 13 మంది నేవీ సిబ్బందిపై అనుమానాలు!

జంతర్ మంతర్ వద్ద ప్రకాష్ రాజ్ నిరసన.. కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు!

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఈ అంశాలపై ప్రత్యేక చర్చ!

ఉత్తరాంధ్రపై బొత్స మాస్టర్ ప్లాన్.. 2029 టార్గెట్‌గా రంగంలోకి రెండో తరం

సర్ వివాదంపై ఆ రెండు పార్టీలు సైలెంట్.. బీజేపీతో లాలూచీ నిజమేనా..?

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ.. 1100 పాయింట్లు పతనం!

Big Stories

Advertisement
×