BigTV English

KA Paul on AP Liquor Bottle: కేఏ పాల్ సంచలనం.. బూమ్ బూమ్ లిక్కర్.. మీకేమో ఫారెన్, మాకేమో లోకల్!

KA Paul on AP Liquor Bottle: కేఏ పాల్ సంచలనం.. బూమ్ బూమ్ లిక్కర్.. మీకేమో ఫారెన్, మాకేమో లోకల్!

KA Paul Comments on Andhra Pradesh Liquor Bottles: ఆంధప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో నేతలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశారు. కేవలం రెండు రోజులు సమయం ఉండడంతో నాలుగైదు రోడ్ షోలు ప్లాన్ చేసుకున్నారు. ఈ విషయంలో ముందున్నారు ప్రజాశాంతి పార్టీ చీప్ కేఏ పాల్. ప్రజలు ఎక్కడ ఎక్కువగా ఉంటారో ఆయన కూడా అక్కడే దర్శనమిస్తున్నారు.


వేళా పాళా లేకుండా ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు కేఏ పాల్. లిక్కర్ షాపుల వద్ద మందుబాబులు వస్తారని భావించిన ఆయన, అక్కడా కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. విశాఖలో ఓ వైన్ షాపు వద్ద లైనులో నిలబడి బూమ్ బూమ్ మందు బాటిల్‌ను కొనుగోలు చేశారు. అక్కడేవున్న మందు బాబులకు బాటిల్ చూపిస్తూ.. వాళ్లకేమో ఫారిన్ బ్రాండ్స్.. మాకేమో లోకల్ బ్రాండ్స్ అంటూ జగన్ సర్కార్‌ను దుయ్యబట్టారు.

గత ఎన్నికల ముందు మద్యపాన నిషేధమన్నారని, ఎక్కడంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేఏ పాల్. చీప్ లిక్కర్ అమ్ముతూ పేదల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. రాజకీయ నేతల మాటలను అస్సలు నమ్మొద్దని చెబుతూ, తనను గెలిపిస్తే న్యాయం చేస్తానన్నారు. ఉచిత విద్య, వైద్యంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. విశాఖ ఎంపీ, గాజువాక అభ్యర్థిగా రెండు చోట్ల పోటీ చేస్తున్నారు పాల్. అలాగే గుర్తును కూడా పదేపదే ప్రస్తావిస్తున్నారు.


Also Read: జగన్‌ను తలుచుకుంటూ.. కన్నీరు పెట్టిన వైఎస్ షర్మిల

కొనుగోలు చేసిన లిక్కర్ బాటిల్‌ను అక్కడే ధ్వంసం చేశారాయన. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి బ్రాండ్‌లు తాగొద్దని ఓటర్లకు హితవు పలికారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. నేతలు పగలు ప్రచారం చేస్తుంటే, తన ప్రచారానికి ఎవరూ ఉండరని భావించారు పాల్. రాత్రి వేళ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముమ్మరంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన్ని దగ్గరుండి గమనించిన వాళ్లు మాత్రం ఆన్‌లైన్‌లో ఎన్నికల ఓటింగ్ పెడితే కేఏపాల్ తిరుగులేని మెజార్టీతో గెలుస్తారని అంటున్నారు. ఆయనకు కోట్లలో ఫాలోయింగ్ ఉందని చెబుతున్నారు.

Related News

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: లిక్కర్ కేసులో కొత్త విషయాలు.. ముడుపుల చేర్చడంలో వారే కీలకం, బిగ్‌బాస్ చుట్టూ ఉచ్చు

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Big Stories

×