Big Stories

AP Election 2024: ఎన్నికల్లో పంపకాల పర్వానికి తెర లేపిన పార్టీలు.. చిత్తూరులో ఓట్ల కోసం నోట్లు!

Distribution of Money For Votes Started in Chittoor District AP Election 2024: ఎన్నికల అంకంలో తుదిఘట్టం మొదలయింది. అత్యంత ఖరీదైనవిగా భావిస్తున్న ప్రస్తుత ఎన్నికల్లో పంపకాల పర్వానికి తెరలేపాయి అన్ని పార్టీలు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను పోటాపోటీగా ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. ఓటుకు 2 వేల నుంచి అయిదే వేల వరకు ఇవ్వడానికి కూడా సిద్దమవుతున్నారు అభ్యర్ధులు. ఆ లెక్కన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓటర్లకు చేరునున్న మొత్తం వింటుంటే గుండె గుబేలు మంటుందంటే అతిశయోక్తి కాదు. సెగ్మెంట్‌ను బట్టి సామాజికవర్గాల లెక్కలు వేసుకుంటూ తమతమ ప్రాధాన్యతలతో కేండెట్లు క్యాష్ పంచుతున్నారు. ఇదంతా ఓపెన్‌గా జరుగుతున్నా అధికార యంత్రాంగానికి మాత్రం కనపడకపోతుండటం విశేషం.

- Advertisement -

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది కార్యక్రమాలు చేసినా ఎన్నికలకు ముందు ఓటుకు నోటు ఇవ్వక పోతే ఓటింగ్‌కు వచ్చే పరిస్థితి లేదు. దాంతో ఓటుకు నోటు కార్యక్రమాన్ని ప్రారంబించారు అభ్యర్థులు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో ఆ తతంగం పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 30 లక్ష్లల వరకు ఉంటే 20 లక్షల ఓటర్లకు డబ్బు ఇరు పార్టీలు పంచడానికి సిద్దం అయ్యాయంటున్నారు.

- Advertisement -

Also Read: కడప కోటలో గెలిచేదెవరు.. అవినాష్ కు ఓటమి తప్పదా?

సగటున ఓటుకు రెండు పార్టీలు కలసి నాలుగు వేలు ఇవ్వడానికి రెడీ అయ్యాయంట .. అంటే 500 కోట్లు ఓటర్ల జేబుల్లోకి చేరడానికి సిద్దం చేసుకున్నారంట.. పలు చోట్ల సామాజిక వర్గాల వారీగా ఓటర్ల లెక్కలు వేసుకుని ఆయా సామజిక వర్గాల ఓట్లను గుంప గుత్తగా కొనుగోలు చేసే వ్యవహారం నడిచింది. ఇక ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా పంపిణీ మొదలయింది. ప్రచార గడువు ముగిసి.. ఎన్నికల కోడ్ నిబంధనలు తీవ్రతరం అయ్యేలోపే పంపిణీ పూర్తి చేయాలని పార్టీలు ఫిక్స్ అయ్యాయి. చెక్ పోస్టులు,మైబైల్ స్కాడ్స్ అంటు అధికారులు హాడావుడి చేస్తున్నా ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో పంపిణీని అడ్డుకునే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో వారికి కూడా ముందుగానే ముడుపులు అందాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో చిత్తూరు, కుప్పం, చంద్రగిరి , తిరుపతి, పుంగనూరు నియోజకవర్గాలు చాలా కాస్ట్లీగా కనిపిస్తున్నాయి. కుప్పంలో అధికార పార్టీ ఓటుకు నాలుగు వేల చొప్పున పంపిణీ కార్యక్రమం ప్రారంభించింది. మరో వెయ్యి అదనంగా పోలింగ్ రోజు ఇస్తామని చెప్తున్నారంట. కుప్పం మొత్తం ఓటర్లు 2.20లక్షల ఓటర్లు..ఇందులో మూడో వంతు ఓటర్లకు నగదు పంపిణీ చేయడానికి వైసీపీ నేతలు లిస్ట్ రెడీ చేసుకున్నారంట.టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో మంత్రి పెద్దిరెడ్డి కుప్పంపై సీరియస్ గా దృష్టి సారించారు. కుప్పం టీడీపీ నేతలు సైతం ఎంపిక చేసిన వర్గాలకు డబ్బులు పంచడానికి రెడీ అయ్యారు. నాలుగు వేలు ఇవ్వక పోయిన అందులో సగం అయిన ఇస్తామంటున్నారంట.

Also Read: Pawankalyan wave in Pithapuram: అంతర్గత సర్వే, పిఠాపురంలో పవన్‌కే మొగ్గు!

చిత్తూరు అసెంబ్లీ పరిధిలో 2.30లక్షల వరకు ఓటర్లు ఉంటారు. ఇందులో 90శాతం మందికి పైగా డబ్బులు పంచడానికి వైసీపీ, టీడీపీలు నిర్ణయించుకున్నాయంట. ఇప్పటికే రెండు పార్టీలు ఓటుకు రెండు వేల చొప్పున పంపిణీ ముగించాయంట. పోలింగ్ ముందు రోజు మరో రెండు వేలు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి, టిడిపి అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఇద్దరు అర్థికంగా బలవంతులే.. గత అరు నెలలుగా వారు నియోజకవర్గంలో ఎన్నికల హడావుడి చేస్తున్నారు. అప్పటి నుంచి ప్రతి రోజూ వారు సగటున పది లక్షలు ఖర్చు పెట్టారంటున్నరు. దీంతో పాటు ప్రతి పండగకు తాయిలాలు పంపిణీ చేసారు. ఒక్కొక్కరు ఈ ఎన్నికల్లో 100 కోట్లు వరకు ఖర్చు పెడుతున్నారన్న టాక్ వినిపిస్తుంది.

చంద్రగిరి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాష్టంలోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గం. దాంతో పాటు ఇక్కడి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రెండుపార్టీలు సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూమారుడు మోహిత్ రెడ్డిఈ సారి అక్కడ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అక్కడ మూడు లక్షల పది వేల మంది ఓటర్లు ఉంటే.. 2.75లక్షల మందికి డబ్బుల పంపిణీ చేస్తామంటున్నారు టీడీపీ, వైసీపీ నేతలు .. ఓటుకి రెండు వేల చొప్పున పంపిణీ అప్పుడే పూర్తి అయిందంట. మరో వైపు అదనంగా కొన్ని ఏరియాలలో ముఖ్యంగా ఓట్లు బదలాయింపు జరుగుతుందని భావిస్తే అయా సెక్టర్ ఓటర్లకు మరో రెండు నుంచి మూడు వేలు ఇవ్వడానికి సిద్దం అవుతున్నారు.

Also Read: Cash Seizure: తవుడు బస్తాల మధ్య 7 కోట్లు.. సినీ తరహాలో తరలింపు.. చివరికి..?

అధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ఓటింగ్ శాతం 50- 60 శాతం లోపేఉంటుంది. ఈ సారి దాన్ని పెంచడానికి ఇరు పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. మెరుగైన అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న జనసేనఅభ్యర్ధి ఆరణి శ్రీనివాసులు ఈ సారి ఓటింగ్ శాతం పెరిగేలా సర్వశక్తులు ఒడ్డుతున్నారంట. కూటమి అవకాశాలు ఉన్నప్పటికి ఓటింగ్ వరకు తీసుకు రావడానికి కష్ట పడుతున్నారు. ఓటుకి 2 నుంచి 4 వేల వరకు ఇవ్వడానికి కూడా వెనకాడటం లేదంట. టీడీపీ పోటీలో లేకపోవడంతో వైసీపీ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటుందనే భయంతో జనసేన పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తున్నారంట. వైసీపీ కూడా ఒక విడత పంపిణీ పూర్తి చేసి .. గత ఎన్నికలలో వైసీపీ ప్రతి ఓటుకు 500 చొప్పున పంపిణీ చేసింది. ఈ సారి అది వేలకు చేరింది.

మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న పుంగనూరులో మొదటి సారి గా ఓటర్లను నేరుగా కలుస్తున్నారు ఆ పార్టీ నేతలు. గతంలో లాగా కాకుండా ప్రతి ఓటుకు మూడు వేల చొప్పున పంపిణీ చేస్తున్నారంట. టిడిపి ఓటుకు రెండు వేల చోప్పున పంపిణీ చేస్తుందని చెప్తున్నారు. మరో వైపు ఇక్కడ పోటీలో బిసివై కూడా పంపిణీ మొదలుపెట్టింది. గత ఎన్నికల్లో స్లిపులు పంపిణీ చేసిన బిసివై పార్టీ ఈసారి డైరెక్ట్ క్యాష్ డెలివరీ చేస్తుందంట.

Also Read: రోజా Vs జబర్దస్త్ టీమ్

నగరిలో మంత్రి రోజా తో పాటు టిడిపి అభ్యర్థి భానుప్రకాష్ ఓటుకు రెండు వేల చొప్పున ఇస్తున్నారంట… అయితే నియోజకవర్గంలో ఓ సామాజిక వర్గం ఓట్లపై దృష్టి సారించిన అధికార పార్టీ ఓటుకు ఐదు వేల చొప్పున 35 వేల మంది ఓటర్లకు ఇస్తున్నట్లు సమాచారం..శ్రీకాళహస్తిలో రెండుపార్టీలు ఓటుకు రెండు వేల చొప్పున పంపిణీ చేస్తుండగా . సత్యవేడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో సైతం రెండు వేల చొప్పున ఇస్తుండటం విశేషం. పూతలపట్టు , జీడి నెల్లూరు నియోజకవర్గాలలో సైతం రెండు వేల చోప్పున పంపిణీ చేస్తున్నారంట. మదనపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఇప్పటికే పంపిణీ పూర్తి చేయగా టీడీపీ ఇంకా ప్రారంభించలేదన్న టాక్ వినిపిస్తుంది.

వెబ్ కాస్టింగ్ నూరు శాతం ఉన్ననియోజకవర్గాలలో ఓటు రేటు పెరిగిందంటున్నారు. పీలేరు, పుంగనూరు, తంబల్లపల్లి, పలమనేరు, రాయచోటి, చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాలలో ఈ పరిస్థితి ఉంది. మొత్తం మీదా గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఓటు రేటు డబుల్, ట్రిపుల్ అయినట్లు కనిపిస్తుంది. అవసరం అనుకున్న చోట అదనంగా ఇవ్వడానికి కూడా వెనకాడటం లేదు అభ్యర్ధులు దీంతో ఈసారి జిల్లాలో పంపకాలకు 500 కోట్లు ఖర్చవుతుందని అంటున్నారు. మరో వైపు యంత్రాగానికి కూడా రెండు పార్టీలు భారీగానే ముట్టచెప్తున్నాయంట. మరి ఇద్దరి దగ్గర డబ్బు తీసుకుంటున్న ఓటర్లు ఎవరి ఆశలు నెరవేరుస్తారో చూడాలి.

Also Read: Sunitha shocking comments on Bharathi: వైఎస్ భారతిపై హాట్ కామెంట్స్.. మమ్మల్ని నరికేస్తారేమో, సింగిల్‌గా ఉండటానికి..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News