Big Stories

Gold Rate Today: నిన్న తగ్గింది.. నేడు పెరిగింది.. ఆలోచనలో పసిడి ప్రియులు!

Today Gold Price: ఇంట్లో ఏ శుభాకార్యాలు జరిగినా బంగారం కొనేందుకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. వివాహ కార్యక్రమాల్లో అయితే బంగారం చాలా మస్ట్. అది లేకుండా పెళ్లి జరగదు అంటే అతిశయోక్తి కాదు.. చివరకు పావులెత్తు బంగారం అయినా పెళ్లి సమయంలో కొనుగోలు చేస్తుంటారు. అందుకే పెళ్లి కార్యక్రమం ఫిక్స్ చేశారంటే ముందుగా బంగారం గురించే ఆలోచన చేస్తుంటారు. నేడు బంగారం ధర ఎంత ఉంది.. ముందు ముందు పెరిగే అవకాశముందా..? అని ఆలోచన చేసి తీసుకుంటుంటారు. అయితే, గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతుండడంతో బంగారం కొనుగోలుదారులు తగ్గారని వ్యాపారులు, ఆభరణాల తయారీ దారులు చెబుతున్నారు. అయితే, తాజాగా కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి.

- Advertisement -

బంగారం ధరలు భారీగా పెరగడంతో హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 930 పెరిగి రూ. 73,090 గా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 850 పెరిగి రూ. 67,000గా ఉంది. వెండి ధరలో రూ. 1300 పెరిగి కిలో వెండికి రూ. 90,000గా ఉంది. అయితే, దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగనున్నాయి.

- Advertisement -

Also Read: స్టాక్ మార్కెట్ క్రాష్.. వెయ్యి పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. 22 వేల దిగువన నిఫ్టీ50..

ఇదిలా ఉంటే.. గురువారం బంగారం ధరలు కొద్ది మేరకు తగ్గిన విషయం తెలిసిందే. 10 గ్రాముల బంగారంపై రూ. 100కు పైగా తగ్గి హైదరాబాద్ లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66,150 గా ఉన్నది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,160గా ఉంది. వెండి ధర కూడా రూ. 100కు పైగా తగ్గి కిలో వెండి ధర రూ. 88,400గా ఉంది. అయితే నేడు బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి.

రోజురోజుకు బంగారం ధరలు మరింత ప్రియమవుతుండడంతో సామాన్య జనాలు బంగారం కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విక్రయదారులు, ఆభరణాల తయారీదారులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News