E-Paper
Advertisement

వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులకు రూ.కోటి ఇవ్వాల్సిందే.. లేదంటే ఉద్యమమే.. కేఏ పాల్ హెచ్చరిక!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులకు రూ.కోటి ఇవ్వాల్సిందే.. లేదంటే ఉద్యమమే.. కేఏ పాల్ హెచ్చరిక!
Advertisement

KA Paul: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నష్టపోయిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ. 1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు, గాయపడిన వారికి మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఈ ఘోర ప్రమాదానికి నైతిక వహిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.

Advertisement

ఎన్నికల సమయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభివృద్ధిపై, దాని ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఇచ్చిన హామీలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే కేంద్రంలోని బీజేపీ నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా పాల్ గుర్తుచేశారు. సొంత లాభాల కోసం కాకుండా, కార్మికుల ప్రయోజనాల కోసం కూటమి నాయకులు పనిచేయాలని, లేనిపక్షంలో ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

Also Read: జగిత్యాలలో మారిన పొలిటికల్ సీన్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జీవన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!

Advertisement

Related News

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

Big Stories

Advertisement
×