BigTV English

Kakinada: భర్త డ్యూటీలో.. ప్రియుడితో భార్య ఆ పనిలో.. భలే దొరికారు

Kakinada: భర్త డ్యూటీలో.. ప్రియుడితో భార్య ఆ పనిలో.. భలే దొరికారు

Kakinada: కాకినాడ సూర్యరావుపేట సమీపంలో సంచలనం రేపిన కుటుంబ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోజూ చెరువుల వద్ద రొయ్యల పనుల్లో ఉండే ఓ భర్త, భార్యపై అనుమానంతో అర్ధరాత్రి ఇంటికి వచ్చి ఊహించని దృశ్యాన్ని చూశాడు. ఇక అంతే వెంటనే సూపర్ స్కెచ్ వేసి, భార్యకు చుక్కలు చూపించాడు. ఈ విషయం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది.


వివరాల్లోకి వెళ్తే, సూర్యరావుపేట ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి, రొయ్యల చెరువులు నిర్వహించే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రివేళల్లో ఎక్కువగా చెరువుల దగ్గర గడిపేవాడు. అతని భార్య గతంలో ఒక ప్రైవేట్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తూ ఉండేది. ఈ క్రమంలో అక్కడే చదువుకునే మణికంఠ అనే యువకుడితో ఆమె సంబంధం పెంచుకుంది.

ఇటీవల ఓ రాత్రి కూడా రోజువారీగా చెరువుల వైపు వెళ్లిన లక్ష్మణ్, భార్యపై అనుమానం వ్యక్తం చేసి అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికే ఇంటి లోపల ఆమెతో పాటు మణికంఠ కూడా ఉన్నాడు. అప్రమత్తమైన లక్ష్మణ్ వెంటనే ఇంటి తాళాలు బయట నుంచి లాక్ చేసి, స్థానికులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి వారి సహాయంతో ఇంట్లో ఉన్న భార్య, ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.


ఇంట్లో నడుస్తున్న అనైతిక సంబంధం రెడ్ హ్యాండెడ్‌గా బయటపడటం స్థానికంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ సంఘటన సూర్యరావుపేట అన్న క్యాంటీన్ సమీపంలో చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: Nizamabad Crime: ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన ఇల్లాలు.. కొడుకు ఊహించని ట్విస్ట్!

కట్టుకున్న భార్య కోసం ఉపాధి నిమిత్తం రాత్రి వేళ భర్త పనులకు వెళ్లగా, ఈ మహిళ చేసిన నిర్వాకం వెలుగులోకి రావడంతో ఇదే ఇప్పుడు కాకినాడ టౌన్ ఆఫ్ ది టాపిక్ గా మారింది. మొత్తం మీద ఇలాంటి చర్యకు పాల్పడిన భార్యకు భర్త తగిన గుణపాఠం చెప్పాడని స్థానికులు అంటున్నారు.

Related News

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Big Stories

×