Karempudi Political Heat: మరోసారి పల్నాడు ఫ్యాక్షన్ భగ్గుమంది. గుంటూరు జిల్లా కారంపూడిలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. టీడీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో దాడికి దిగాయి. అంతేకాకుండా టీడీపీ ఆఫీసులోని ఫర్నీచర్ తో పాటు రెండు దుకాణాలను ధ్వంసం చేశాయి.
దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. దాడులకు పాల్పడుతున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేయగా, సీఐకి గాయాలయ్యాయి. దీంతో కారంపూడిలో ఉద్రిక్తత నెలకొంది. ఇంతటితో ఆగకండా టీడీపీ నేత జానీబాషా వాహనానికి నిప్పుపెట్టారు వైసీపీ మూకలు.
వైసీపీ శ్రేణులు తెలుగు దేశం పార్టీ కార్యాలయం పక్కన ఉన్న దుకాణాలను ధ్వంసం చేయడంతో చిరువ్యాపారులు లబొదిబొమంటున్నారు. రాజకీయాలకు తమ వ్యాపారాన్ని, తమ ఉపాధిని ధ్వంసం చేశారని కన్నీరుమున్నీరవుతున్నారు.
దీంతో మాచర్ల నియోజకవర్గంలో 144 సెక్షన్ విధిస్తూ జిల్లా ఎస్పీ నిర్ణయం తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ బింధు మాధవ్ బిందు మాధవ్ హింసను సహించేది లేదని తేల్చి చెప్పారు.
Also Read: తిరుపతిలో హైటెన్షన్.. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి.. ఎస్పీ సీరియస్
మాచర్లకు అదనపు పోలీస్ బలగాలు పంపుతుతన్నట్లు ఏపీ డీజీపీ తెలిపారు. మాచర్ల నియోజకవర్గ పరిధిలో హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు.
కాలిపోతున్న కారంపూడి..
కారంపూడిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కారంపూడిలో మారణాయుధాలతో కొంత మంది హల్చల్ చేస్తున్నారు. వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు.. కారంపూడిలో ఉన్న టీడీపీ ఆఫీస్ లో గల ఫర్నిచర్ ధ్వంసం అయింది. అలాగే రెండు దుకాణాలు కూడా ధ్వంసం… pic.twitter.com/kBLhUGolYk— ChotaNews (@ChotaNewsTelugu) May 14, 2024