BigTV English

Thank you lokesh Sir: సీన్ రివర్స్.. థ్యాంక్యూ లోకేష్ సర్

Thank you lokesh Sir: సీన్ రివర్స్.. థ్యాంక్యూ లోకేష్ సర్

‘కాశినాయన క్షేత్రంలో కూల్చివేతలు’ అనే అంశం ఇటీవల ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశాన్ని ప్రతిపక్ష వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూసింది కానీ, చివరకు వ్యవహారం టీడీపీకి, అందులోనూ ప్రత్యేకంగా నారా లోకేష్ కి పాజిటివ్ గా మారడం విశేషం. తాజాగా కడప జిల్లా కాశినాయన క్షేత్రంలో థ్యాంక్యూ లోకేష్ సర్ అంటూ కొంతమంది బ్యానర్లు ప్రదర్శించడం, బస్సు సౌకర్యం కల్పించినందుకు భక్తులు ప్రత్యేకంగా మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు చెప్పడం హైలైట్ గా మారింది. ఆ వీడియోలను టీడీపీ సోషల్ మీడియా అకౌంట్ లో అప్ లోడ్ చేసింది. కాశినాయన జ్యోతి క్షేత్రం భక్తులకు ఇచ్చిన మాటను నారా లోకేష్ వెంటనే నెరవేర్చారని, అందుకే అక్కడి భక్తులు ఆయనకు థ్యాంక్స్ చెప్పారని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందనుకున్న అంశాన్ని కూడా ఒక వ్యూహం ప్రకారం తమకి అనుకూలంగా మార్చుకున్నారు నారా లోకేష్. దీంతో ప్రతిపక్షం ఎత్తుగడ పూర్తిగా సక్సెస్ కాలేదు. ఒకరకంగా చెప్పాలంటే సీన్ రివర్స్ అయింది.


కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం కాశినాయన మండలం వరికుంట్ల గ్రామం దగ్గర ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో కాశినాయన జ్యోతి క్షేత్రం ఉంది. ఎంతమంది భక్తులు వచ్చినా, ఒక్కరికి కూడా లేదు అనకుండా నిత్యాన్నదానం చేయడం ఈ కాశినాయన క్షేత్ర ప్రత్యేకత. అనంతర కాలంలో కాశినాయన క్షేత్రాలు ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పడ్డాయి. అయితే వీటన్నిటికీ మూలం అయిన జ్యోతి క్షేత్రం కడప జిల్లాకు ప్రత్యేకంగా నిలిచింది. అయితే 13 హెక్టార్ల భూమి విషయంలో మాత్రం ఎప్పటినుంచో వివాదం ఉంది. ఆ 13 హెక్టార్ల ప్రాంతంలో కాశినాయన క్షేత్రంలో నిర్మాణాలు ఉన్నాయి. వాటిని తొలగించాలని అటవీ అధికారులు క్షేత్ర నిర్వాహకులకు పలుమార్లు నోటీసులు కూడా ఇచ్చారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుపడటం, కేంద్ర అటవీ శాఖ అధికారులకు విన్నపాలు ఇవ్వడంతో ఈ గొడవ తాత్కాలికంగా సద్దుమణుగుతూ వచ్చింది. గత వైసీపీ హయాంలో కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. కేంద్రానికి లేఖ రాసినట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నేరుగా అధికారులు కూల్చివేతలకు సాహసించడంతో వ్యవహారం సీరియస్ గా మారింది.

కూటమిపై విమర్శలు..
గతంలో కేవలం నోటీసులతోనే సరిపెట్టే అధికారులు నేరుగా కూల్చివేతలకు దిగడంతో కూటమి ప్రభుత్వానికి కూడా ఇది మింగుడు పడని వ్యవహారంగా మారింది. హిందూ మతోద్ధారకులు అని చెప్పుకునే బీజేపీ నేతలు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నా కూడా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటూ వైరివర్గం దుమ్మెత్తిపోసింది. దీంతో బీజేపీ నేతలు కూడా కేంద్రంలోని పెద్దల్ని సంప్రదించి, అటవీ భూముల వ్యవహారంలో మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇటు మంత్రి నారా లోకేష్ తానే స్వయంగా చొరవ తీసుకున్నారు. కూల్చివేతల వషయంలో తానే స్వయంగా క్షమాపణ చెప్పడం విశేషం. అయితే అటవీశాఖ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దగ్గర ఉంది. ఆ శాఖ విషయంలో లోకేష్ చొరవ ఏంటని, ఆయన క్షమాపణ చెప్పడమేంటని ప్రతిపక్ష వైసీపీ నిలదీసింది. సనాతన ధర్మంపై దాడి చేస్తే తలలు తీస్తానన్న పవన్ ఏమై పోయారని సూటిగా ప్రశ్నించింది. లోకేష్, పవన్ మధ్య వైరుధ్యాలున్నాయని, అందుకే విద్యాశాఖ మంత్రి ఈ విషయంలో కలుగజేసుకున్నారని కూడా వైసీపీ నేతలు విమర్శించారు. ఈ విమర్శలు ఎలా ఉన్నా.. లోకేష్ చేపట్టిన దిద్దుబాటు చర్యలు మాత్రం కూటమి పరువు పోకుండా కాపాడాయని చెప్పొచ్చు.

కూల్చివేతల అనంతరం క్షేత్ర ప్రాశస్త్యాన్ని పూజారి జీరయ్య స్వామి ద్వారా తెలుసుకున్నారు లోకేష్. తన సొంత నిధులతో అక్కడ నిర్మాణాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అటవీ శాఖతో ఇకపై ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్పారు. ఇక అసెంబ్లీ, శాసన మండలిలో కూడా దీనిపై చర్చ జరిగింది. పొరపాటుని అంగీకరిస్తూనే ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. లోకేష్ ఆదేశాలతో అధికారులు హుటాహుటిన అక్కడకు వెళ్లారు. షెడ్ల నిర్మాణాన్ని అప్పుడే మొదలు పెట్టారు. నేటికి తుదిరూపు తెచ్చారు. ఇక ఎన్నాళ్లనుంచో భక్తులు ఎదురు చూస్తున్న బస్సు సౌకర్యం కూడా వారికి అందుబాటులోకి రావడం విశేషం. కూల్చివేతల సంగతి పక్క పెడితే.. ఈ వ్యవహారంతో భక్తులకు బస్సు సౌకర్యం కలిగింది. 24 గంటల్లోగా ఆర్టీసీ బస్సు సర్వీసుని అందుబాటులోకి తెచ్చారు. గతంలో వరికుంట్ల గ్రామం వరకే బస్సులు వచ్చేవి. ఇప్పుడు వాటిని కాశినాయన క్షేత్రం వరకు పొడిగించారు.

మొత్తమ్మీద.. కాశి నాయన క్షేత్రంలో నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో కూటమి ఒడ్డున పడిందనే చెప్పాలి. నారా లోకేష్.. స్వయంగా కలుగజేసుకోవడంతో రోజుల వ్యవధిలోనే ఓ పరిష్కార మార్గం దొరికింది. కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టిన ప్రతిపక్ష వైసీపీ కూడా ఇప్పుడు వాటిని కొనసాగించలేని పరిస్థితి. వైసీపీ హయాంలో అటవీ శాఖతో వివాదాలు ఉన్నాయి. కూటమి వచ్చాక అవి ఇప్పుడు శాశ్వతంగా తొలగిపోతున్నాయి.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×