Postpartum Weight: గర్భధారణ సమయంలో బరువు పెరగడం సహజం. కానీ ప్రసవం తర్వాత కూడా బరువు తగ్గకపోతే.. చాలా మందిలో ఆందోళన పెరుగుతుంది. ముఖ్యంగా సి-సెక్షన్ తర్వాత బరువు తగ్గడం చాలా కష్టం. అలాంటి సమయంలోనే కొందరు మహిళలు ఇంటర్నెట్‌లో సూచించిన టిప్స్ అనుసరిస్తారు.
కానీ అవి ఆశించినంత మంచి ఫలితాలను ఇవ్వవు. మీరు కూడా ప్రసవం తర్వాత బరువు పెరిగి ఆందోళన చెందుతుంటే మాత్రం.. అమ్మమ్మల కాలం నాటి చిట్కాలను పాటించండి. ఇవి మీ బరువును ఈజీగా తగ్గిస్తాయి. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి హెర్బల్ డ్రింక్ :
డెలివరీ తర్వాత బరువు నియంత్రణలో ఉంచుకోవాలంటే.. మీ శరీరంలో తగినంత నీరు ఉండాలి. వేగంగా బరువు తగ్గడానికి, ఎలక్ట్రోలైట్స్ , జీవక్రియను నిర్వహించడం కూడా ముఖ్యం. ఇందుకోసం గోరు వెచ్చని నీటిలో ఒక చెంచా తేనె వేసి తాగడం మంచిది. ఇది చాలా ప్రభావ వంతమైన పరిష్కారం. ఇదే కాకుండా మీరు హెర్బల్ , గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు జీవక్రియను పెంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి ప్రసవం తర్వాత బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి.
తల్లిపాలు :
ప్రసవానంతర బరువు తగ్గడం: పాత రోజుల్ల.., మన అమ్మమ్మలు తమ పిల్లలకు క్రమం తప్పకుండా తల్లి పాలు ఇవ్వాలని మన తల్లులకు సలహా ఇచ్చేవారు. ఇది శిశువుకు పోషకాహారాన్ని అందించడమే కాకుండా.. తల్లి పాలలో ఉండే ప్రతిరోధకాలు పిల్లలను ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. అంతే కాకుండా బరువు తగ్గించడంలో కూడా సహాయపడతాయి. క్రమం తప్పకుండా తల్లిపాలు ఇవ్వడం ద్వారా మీరు మునుపటిలాగా సన్నగా, అందంగా మారతారు.
పొట్టపై కాటన్ క్లాత్ కట్టుకోండి:
నేటికీ.. ఇంట్లోని పెద్దవారు మహిళలకు ప్రసవం తర్వాత పొట్టను కాటన్ గుడ్డతో కట్టుకోవాలని సలహా ఇస్తారు. ఇది తల్లులకి చాలా ఓదార్పునిస్తుంది. ఇలా చేయడం వల్ల కడుపు కూడా ఉబ్బిపోదు. ఇప్పుడు మెడికేటెడ్ బెల్టుల వాడకం పెరిగింది.వీటితో కూడా మీ పొట్ట పెరగకుండా ఉంటుంది.
గోరువెచ్చని నీరు త్రాగండి :
డెలివరీ తర్వాత కనీసం 6 నెలల పాటు వేడి లేదా గోరు వెచ్చని నీరు తాగడం వల్ల పొట్టపై పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది. నిజానికి, గోరు వెచ్చని నీరు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును సులభంగా తొలగిస్తుంది. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీరు దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో మాత్రమే తాగాలి. అప్పుడే మీకు ప్రయోజనం లభిస్తుంది. అంతే కాకుండా మీకు కొన్ని రోజుల్లో తేడా కనిపిస్తుంది.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు:
గర్భధారణ తర్వాత బరువు తగ్గడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినడం మంచిది. దీన్ని తినడం వల్ల మీరు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని పొందుతారు. అంతే కాకుండా ఆకలి హార్మోన్ స్థాయిని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఉత్తమమైన విషయం ఏమిటంటే ఫైబర్ అధికంగా ఉండే ఆహారంలో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. దీని కారణంగా బరువు పెరిగే అవకాశం ఉండదు.
Also Read: PCOS నుండి బయటపడాలంటే.. ఈ ఫుడ్ తినండి !
మంచి నిద్ర చాలా అవసరం:
బిడ్డ పుట్టిన తర్వాత నిద్ర సరిగా లేకపోవడం బరువు పెరగడానికి కారణమవుతుంది. నిజానికి గర్భధారణ తర్వాత హార్మోన్లు అసమతుల్యత పెరుగుతుంది. దీని నుండి కోలుకోవడానికి చాలా నిద్ర అవసరం. కానీ నిద్ర పూర్తిగా లేనప్పుడు, హార్మోన్లు సమతుల్యంగా ఉండవు . అంతే కాకుండా ఒత్తిడి కారణంగా బరువు పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి తగినంత నిద్రపోవాలి