Kasireddy : కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఎక్కడ? ఇప్పటికే మూడు సార్లు సీఐడీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్‌లోని ఆయన ఇల్లు, ఆఫీసుల్లో విస్తృతంగా గాలించింది. ఆయన ఆచూకీ కోసం నాలుగు రాష్ట్రాల్లో వెతుకుతోంది. అయినా, కసిరెడ్డి జాడ తెలీలేదు. చిక్కడు దొరకడు టైప్‌లో తప్పించుకుంటున్నారు. ఏపీ లిక్కర్ స్కాంలో ఆయనే కర్త, కర్మ, క్రియ అంటూ విజయసాయిరెడ్డి బాంబు పేల్చాక.. కసిరెడ్డి విచారణ మరింత కీలకం కానుంది. రాజశేఖర్‌రెడ్డి కోసం ఏపీ సీఐడీ పోలీసులు వెతుకుతుంటే.. ఆయన మాత్రం తీరిగ్గా ఓ ఆడియో రికార్డును రిలీజ్ చేశారు.
కసిరెడ్డి ఆడియోలో ఏముందంటే..
విచారణకు హాజరు కావాలంటూ లిక్కర్ స్కామ్ కేసులో తనకు నోటీసులు ఇచ్చారని ఆడియోలో చెప్పారు. 24 గంటల్లోనే తాను ఆ నోటీసులకు బదులు ఇచ్చానని చెప్పారు. ఎంక్వైరీకి ఎందుకు పిలిచారని తాను సిట్ అధికారులను అడిగానని చెప్పారు. తాను లేనపుడు తన తల్లికి నోటీసులిచ్చారని ఆడియోలో చెప్పుకొచ్చారు కసిరెడ్డి. ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ వేశానని.. తన లాయర్లను సంప్రదించినట్టుగా చెప్పా. మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు కసిరెడ్డి. విజయసాయిరెడ్డి చరిత్ర త్వరలోనే అందరి ముందు బయట పెడతానని హెచ్చరించారు.
కసిరెడ్డిపై విజయసాయి ఎఫెక్ట్
దారులన్నీ మూసుకుపోయాయి. సీఐడీకి దొరక్కుండా ఇంకా ఎంతోకాలం తప్పించుకోలేరు. ఇప్పటికే విజయసాయిరెడ్డి అడ్డంగా ఇరికించేశారు. లిక్కర్ స్కాం డీల్స్ అన్నీ కసిరెడ్డినే చేశాడని చెప్పారు. అరబిందో నుంచి 100 కోట్లు అప్పుగా ఇప్పించానని అన్నారు. సీఐడీ విచారణలో ఆయనో తెలివైన క్రిమినల్ అంటూ రాజ్ కసిరెడ్డి గురించి సర్వం చెప్పేశారు విజయసాయి. అటు, మిథున్‌రెడ్డిని సైతం ఏపీ సీఐడీ సుదీర్ఘంగా విచారించింది. ఇలా ఏపీ లిక్కర్ దందాలో కింగ్ పిన్.. కసిరెడ్డినే అని స్పష్టం అవుతోంది. మద్యం తయారీ, పంపిణీ లెక్కలు, వాటాలు, ముడుపులు.. ఆ చిట్టా మొత్తం ఆయన చేతిలోనే ఉందనే క్లారిటీకి వచ్చేసింది సీఐడీ. కసిరెడ్డిని విచారిస్తేనే.. బిగ్ బాస్ హస్తం బయటపడుతుందని భావిస్తోంది. సీఐడీ తన విషయంలో ఎంత సీరియస్‌గా ఉందో గుర్తించారు కసిరెడ్డి. ఇప్పటికే ఆయన తండ్రిని సైతం సిట్ ప్రశ్నించింది. ఇక విచారణకు రాకుండా ఎన్నో రోజులు దాక్కోలేమని తెలిసి.. ఇప్పుడిలా ఆడియో రికార్డింగ్ రిలీజ్ చేసి.. లొంగిపోయే ముందు.. తన తప్పేమీ లేదనేలా ప్రజల్లోకి మెసేజ్ వదలాలనేది కసిరెడ్డి ఎత్తుగడగా తెలుస్తోంది.
Also Read : తల్లి పుట్టినరోజును పట్టించుకోని జగన్.. ఏం కొడుకండీ?
ఈ ఆడియోలు గట్రా కాదు.. అసలు నువ్వెక్కడా? విచారణకు ఎందుకు రావట్లేదు? అంత భయమెందుకు? ఎంక్వైరీకి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? నీ వెనుక ఎవరున్నారు? అంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.