Fire accident: హైదరాబాద్, నిమ్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అత్యవసర విభాగంలో ఈ ప్రమాదం జరిగింది. ఐదో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ దట్టమైన పొగ అలుముకుంది. దీంతో అక్కడున్న రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
Also Read: Jobs: డిగ్రీ అర్హతతో మన ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.30,000.. రేపే లాస్ట్ డేట్
వెంటనే ఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది..? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
నిమ్స్ అగ్ని ప్రమాద ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు. హాస్పిటల్ డైరెక్టర్ బీరప్పతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిమ్స్ ఎమర్జెన్సీ బిల్డింగ్ ఐదో అంతస్తులో ఆడిటోరియం వద్ద నాన్ పేషెంట్ ఏరియా లో షార్ట్ సర్క్యూట్ జరిగిందని అధికారులు తెలిపారు. పొగలు వచ్చిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, మంటలు అంటుకోకుండా చర్యలు తీసుకున్నారని మంత్రికి వివరించారు. అక్కడెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. అస్తి నష్టం కూడా జరగలేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే ముప్పు ఎక్కువగా ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు సూచించారు.
Also Read: CSIR-NGRI: ఇంటర్ పాసైతే చాలు.. మన హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగం.. జీతమైతే నెలకు రూ. రూ.38,483