E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఏపీని కుదిపేస్తున్న బిగ్గెస్ట్ స్కామ్.. ఏకంగా రూ.350 కోట్లు? ఈడీకి లేఖ రాసిన మాజీ ఎంపీ

ఏపీని కుదిపేస్తున్న బిగ్గెస్ట్ స్కామ్.. ఏకంగా రూ.350 కోట్లు? ఈడీకి లేఖ రాసిన మాజీ ఎంపీ
Advertisement

Vijayawada: విజయవాడలో అన్నదమ్ముల మధ్య రాజకీయాలు వేడెక్కాయి. ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు మాజీ ఎంపీ కేశినేని నాని. పోలవరం కుడి కాలువకు లింక్ చేశారు. ఏకంగా 350 కోట్ల స్కామ్ జరిగిందంటూ మాజీ ఎంపీ ఈడీ లేఖ రాయడం తీవ్ర కలకలం రేపుతోంది.

పోలవరం కుడి కాలువలో రూ. 350 కోట్ల అవినీతి

Advertisement

విజయవాడలో కేశినేని బ్రదర్స్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. కొన్నాళ్లుగా ఎంపీ కేశినేని చిన్ని-నాని మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఎలాగైనా చిన్నిని టీడీపీకి దూరం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు నాని. ఈ క్రమంలో మరొక అస్త్రం ప్రయోగించారు.

ఎంపీ కేశినేని చిన్ని రూ. 350 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఈడీకి ఫిర్యాదు చేశారు మాజీ ఎంపీ కేశినేని నాని. అంతేకాదు దీనికి పోలవరం కుడికాలువను లింకు చేశారు. అసలు మేటరేంటి? కేశినాని కేవలం తన తమ్ముడ్ని టార్గెట్ చేయడమేకాదు, ఏకంగా టీడీపీకి ఈ ఉచ్చులోకి లాగారు. అసలు ఈ స్కామ్ వెనుక మేటరేంటి?

Advertisement

విజయవాడ ఎంపీ చిన్ని సూత్రధారి అంటూ ఈడీకి మాజీ ఎంపీ లేఖ

కేశినేని నాని చేసిన ఆరోపణలు ఏపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఎంపీ కేశినేని చిన్ని రూ. 350 కోట్ల భారీ స్కామ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. విజయవాడ సిటీలోని గురునానక్ కాలనీలోని రావూరి విస్టా కేంద్రగా కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. నాని ఆరోపణలకు పోలవరం కుడికాలువకు లింకు చేశారు.

5 క్యూబిక్ మీటర్లకు మట్టి అవ్వకాలకు అనుమతి తీసుకుని 2 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా కెనాల్ మట్టిని అక్రమంగా తవ్వి అక్రమంగా రవాణా చేశారని ఆరోపించారు. ఈ స్కామ్‌కు సూత్రధారి ఎంపీ కేశినేని చిన్ని కుండబద్దలు కొట్టేశారు. రావూరి విస్టాలోని ఫ్లాట్ 301లో వెంటనే తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు.

అంతేకాదు చిన్ని బినామీ ఖాతాలను స్తంభింప చేయాలని ఈడీ రాసిన లేఖలో పేర్కొన్నారు. తొలి మట్టి తవ్వకాలు చేపట్టిన ఖాన్ & మాజీ కార్పొరేటర్ మల్లికార్జున్, క్షేత్రస్థాయిలో పనిచేసిన ముల్పూరి కిషోర్, దాసరి జగదీష్, పోలవరపు సుకుమార్, కళ్యాణ్ చెప్పుకొచ్చారు. టిప్పర్లతో మట్టిని తరలించిన చిట్టి బాబు, బుడ్డి తరలించారని రాసుకొచ్చారు.

ALSO READ: పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు కార్మికులు మృతి  

ఆర్ధిక లావాదేవీలను ఎంపీ చిన్ని క్యాషియర్ కోదాడ రమేష్ చక్కబెట్టారు ఆ లేఖలో ప్రస్తావించారు. తక్షణమే ఎంపీ మట్టి మఫియా పై ఈడీ చర్యలు చేపట్టాలని కోరారు. కేశినేని నాని చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు నోరు విప్పలేదు కేశినేని చిన్ని. వందల కోట్ల స్కామ్ ఆరోపణలు రావడంతో టీడీపీలో చర్చ మొదలైంది.

అన్నదమ్ముల మధ్య రచ్చపై పార్టీకి లింకు పెట్టడంపై ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు. కేశినేని నాని చేస్తున్నవి కేవలం రాజకీయ ఆరోపణలా? నిజమేనా? నాని రాసిన లేఖపై సీఎం చంద్రబాబు స్పందిస్తారా? ఈడీ విచారణ జరుపుతుందా? ఇవే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. దీని వెనుక వైసీపీ ప్రమేయం ఉందని చర్చ లేకపోలేదు.

Related News

పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు కార్మికులు మృతి, ఘటన ఎలా జరిగింది?

నా రాజాను వదిలేయండి.. పోలీసు స్టేషన్ ఎదుట.. దివ్వెల మాధురి రచ్చ రచ్చ!

చేసిందంతా చేసి.. విజయసాయిరెడ్డికి ‘ఆర్థిక కష్టాలు’, ఆ రిపోర్ట్ ఆందోళనకరం

సాయికృష్ణ అదృశ్యం కేసు కొత్త మలుపు.. సిఐ నాగరాజుని అరెస్ట్ చేయవద్దని ఆందోళన, ప్రభుత్వం సిట్ ఏర్పాటు

టెక్నాలజీకే కాదు.. ఆధ్యాత్మిక కేంద్రంగా ఏపీ.. యోగా గురు బాబా రాందేవ్‌‌తో సీఎం చంద్రబాబు యోగాసనాలు

Pawan Warning: పవన్‌కు హోంశాఖ? వైసీపీ గుండాలకు ఇక మూడేళ్లు ఇత్తడే, డోర్ డెలివరీ మాటేంటి?

కర్నూలు గడ్డ.. బంగారం అడ్డా.. దేశం చూపు ఇప్పుడు ఏపీ వైపే!

Big Stories

×