Budget Sessions 2025 : మధ్యాదాయ వర్గాలకు ఊరట కలిగించేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను స్లాబుల్లో మార్పులు సూచించారు. ఇది మధ్యాదాయ చెల్లింపుదారులు అందరిపై భారాన్ని తగ్గించేందుకు ఉపక్రమిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రత్యేక ఆదాయం మినహా రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను భారం ఉండదని స్పష్టం చేశారు. సవరించిన శ్లాబ్‌లు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుండడంతో ఎవరెవరి ఆదాయానికి పన్ను మినహాయింపులు ఉండనున్నాయో తెలుసుకునేందుకు ఆసక్తి పెరిగింది.
ఈ ప్రకటన నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక మంది వివిధ మీమ్స్ తో పన్ను నిర్మాణాన్ని సంస్కరణలను స్వాగతిస్తున్నారు. అయితే తాజా మార్పుల తర్వాత పన్ను చెల్లింపుదారులు ఎంత ఆదా చేస్తారనే గందరగోళం చాలా మందిలో ఉంది. ఈ విషయంపై కొంత మంది యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే.. ప్రస్తుతానికి ప్రభుత్వం బడ్జెట్లో పన్ను స్లాబ్ ల సవరణలకు ప్రతిపాదించింది కానీ, పూర్తి స్థాయిలో స్లాబుల సమాచారాన్ని విడుదల చేయలేదు. వచ్చే వారంలో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఈ స్లాబుల విధానం, పన్ను వసూలు చేసే స్లాబుల వర్గీకరణను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే.. ప్రజల ఆసక్తి మేరకు ఆర్థికాంశాల్లో నిపుణులు స్లాబుల వర్గీకరణపై అవగాహన కల్పిస్తుంది.
కొత్త పాలనలో రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రకటించిన కారణంగా.. రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే.. జీతం ద్వారా ఆదాయం పొందే వారికి రూ. 12.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు. పన్ను మినహాయింపులు, సవరించిన పన్ను విధానాలపై గందరగోళం మధ్య.. యూజర్లు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నారు.
అయితే.. వ్యక్తిగత ఆదాయం రూ. 12 లక్షల కంటే ఎక్కువ ఉంటే.. స్టాండర్డజ్ డిడక్షన్ వంటి రాయితీ అందుబాటులో ఉండదు. కాబట్టి స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను ప్రారంభమవుతుందని చెబుతున్నారు.
Explainer on the new tax scheme. If your income is 12 lakh no income tax. If your income is more than that,see below. #IncomeTax pic.twitter.com/isK4wVtPJS
— Sumanth Raman (@sumanthraman) February 1, 2025
చాలా మంది విశ్లేషకులు, ఉద్యోగులు కొత్త పన్ను విధానంలో పన్నుల భారం గణనీయంగా తగ్గుతుందని ఆశిస్తున్నారు.దాంతో.. నెలవారీ పొదుపు మొత్తాలు పెరుగుతాయని.. ఈ కారణంగా ఇంటి అవసరాలకు పెట్టే ఖర్చు పెరుగుదల, పొదుపు, పెట్టుబడి వంటివి పెరుగుతాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
డొమైన్ నిపుణులు ఏమి చెబుతారు
ఆర్థిక రంగంలో అనుభవం ఉన్న నిపుణులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించేందుకు కేంద్రం సరైన చర్య తీసుకుందని, మధ్యతరగతి వర్గాలకు చేతిలో మరికాస్త డబ్బు మిగిలేలా చేస్తుందని చెబుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలచే మధ్యస్థాయి ఆదాయ వర్గాల వారికి.. ఈ చర్యలో ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. వివిధ రకాల ఖర్చుల ద్వారా మార్కెట్లో డబ్బు ప్రవాహం పెరగడంతో ఆర్థిక వృద్ధిని మరింత పెంచుతుందని భావిస్తున్నారు” అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నితిన్ బైజల్ డెలాయిట్ ఇండియా అభిప్రాయపడ్డారు.
అయితే.. ఈ వార్తలు, సమాచారం మధ్య ఇన్ కమ్ ట్యాక్స్ ఇండియా స్పందించింది. ప్రస్తుత బడ్జెట్ లో ప్రతిపాదించిన పూర్తి స్థాయి పన్నులు, స్లాబుల వివరాలు తెలుసుకునేందుకు కాస్త సమయం పడుతుందని తెలిపింది. మరికొన్ని రోజుల్లోనే కేంద్ర ఆర్థిక శాఖ ఈ ఆర్థిక ఏడాదిలో అనుసరించనున్న పన్ను విధానాలపై పూర్తి స్థాయి స్పష్టతతో వివరాలు వెల్లడిస్తుందని తెలిపింది.
Stay updated on the proposals related to direct taxes in #Budget2025. Our FAQs provide insights into key amendments and their impact.
Read here the FAQs providing insights into the changes related to Direct Taxes.https://t.co/7af0p6lDf8@nsitharamanoffc @officeofPCM…
— Income Tax India (@IncomeTaxIndia) February 1, 2025
Also Read : గుడ్ న్యూస్.. వీటి రేట్లు తగ్గిపోతాయ్.. అవి మాత్రం మహా ప్రియం