BigTV English

TTD Board Meeting : టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పాలక మండలి కీలక నిర్ణయాలు..

TTD Board Meeting : టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పాలక మండలి కీలక నిర్ణయాలు..

TTD Board Meeting : టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్నమయ్య భవన్‌లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తామని ప్రకటించారు. 114 జీవో ప్రకారం ఎంత మందికి అవకాశం ఉంటే అంత మందిని క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. తిరుమల ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్న 650 మంది ఉద్యోగులను మరో ఏడాది పొడిగించాలని నిర్ణయించింది.


అలిపిరి గోశాలలో శ్రీనివాస హోమం ఈ నెల 23 నుంచి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుపతి రాంనగర్ క్యాట్రస్‌లో అభివృద్ధి పనులకు 6.15 కోట్లు కేటాయించింది. మంగళం ఆర్టీవో కార్యాలయం నుంచి తిరుచానూరు రోడ్డు అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించింది.

టీటీడీ ఉద్యోగులు అందరికి ఇంటిస్థలాలు ఇవ్వాలని తీర్మాణించింది. టీటీడీ ఉద్యోగాలకు ఇంటి స్థలం కేటాయించే ప్రాంతాల్లో 27.65 లక్షలతో గ్రావెల్ రోడ్డు నిర్మించనుంది.రూ.15 కోట్లుతో అదనపు రోడ్డు నిర్మాణం చేపట్టనుంది. ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ప్రకటించింది. శాశ్వత ఉద్యోగులకు 14 వేలు, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6850 ఇవ్వాలని నిర్ణయించింది.


తిరుపతి పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిలో నూతన టీబీవార్డు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. స్వీమ్స్ లో రోగుల విశ్రాంతి భవనానికి నిధులు కేటాయించింది.స్వీమ్స్ లో వైద్య సదుపాయాలు పెంపునకు నిర్ణయం తీసుకుంది. కార్డియో నూతన భవనం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్విమ్స్ ఆసుపత్రి భవనాన్ని ఆధునీకరణకు రూ. 197 కోట్లు కేటాయించింది. తిరుపతి డీఎఫ్ఓ ఆధ్వర్యంలో కొత్త కెమెరాలు, బోన్లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కరీంనగర్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మించాలని నిర్ణయించింది. సాంప్రదాయ కళల అభివృద్ధికి ప్రాథమిక శిక్షణ ఇవ్వాలని తీర్మానించింది. కలంకారీ, శిల్పకళ శిక్షణ ఇవ్వాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.

Related News

Vizag Rainfall: మరో 3 రోజుల వర్షాలు.. విశాఖ వాసులకు టెన్షన్ పెంచుతున్న వాతావరణం!

NTR fans protest: అనంతపురంలో ఉద్రిక్తత.. బహిరంగ క్షమాపణకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్!

MLA Daggubati Prasad: ఆ ఆడియో నాది కాదు.. కానీ సారీ అంటూ ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే!

AP real estate: ఏపీలో రియల్ ఎస్టేట్ హవా.. 3 నెలల్లోనే మరీ ఇంత ఆదాయమా!

AP pensioners: ఏపీ వికలాంగులు, మెడికల్ పింఛనుదారులకు శుభవార్త.. వారికి మాత్రం వర్రీనే!

Terrorist Noor Mohammed: నూర్ మహమ్మద్ పై దేశద్రోహ కేసు.. 14 రోజుల రిమాండ్

Big Stories

×