Kodali Nani on Vamsi Arrest: రాజకీయ నేతలు ఎప్పుడు ఏ విధంగా మారుతారో చెప్పలేం. సమయం, సందర్భాన్ని బట్టి వ్యవహరిస్తారు. మా మాటలను వక్రీకరించారంటూ మీడియాపై ఆ నెపాన్ని నెట్టేస్తారు. అలాంటి వారిలో మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని కూడా ఒకరు. వంశీ అరెస్ట్ తర్వాత మీడియాకు దూరమైన ఆయన, మంగళవారం జైలులోవున్న వంశీని కలిసేందుకు వెళ్ల క్రమంలో బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన మాటల్లో అయితే భయం స్పష్టంగా కనిపిస్తోంది.
తగ్గిన కొడాలి ఫైర్
వైసీపీ ఫైర్ బ్రాండ్ అనగానే రోజా తర్వాత గుర్తుకు వచ్చే నేతల్లో కొడాలి నాని ఒకరు. గడిచిన ఐదేళ్లు ఓ రేంజ్‌లో చెలరేగిపోయారు. ఆయన మాటలు గమనించిన శాఖ మార్చారేమోనని అనుకున్నారు. అయినా టీడీపీ అధినేతపై బలమైన విమర్శలు సంధించారు. కొన్నిసార్లు మాటలు (బూ.. లు) జారిన సందర్భాలు లేకపోలేదు. వైసీపీ అధికారంలో ఉండగా రానున్న రోజులు తమకు తిరుగులేదని భావించారాయన. మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది.
కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత సైలెంట్ అయ్యారు కొడాలి నాని. కొద్దిరోజులుగా కనిపించడం మానేశారు. దీంతో కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లారంటూ వార్తలు వచ్చాయి. ఫోన్లు కూడా స్విచాఫ్ చేసుకున్నట్లు తెలిసింది. ఇక అరెస్ట్ కావాల్సిన జాబితాలో తొలుత కొడాలి నాని పేరు ఉందని టీడీపీ నేతలు టీవీ డిబేట్లలో ప్రస్తావించారు కూడా. కర్మ ఫలం ఏ ఒక్కరినీ వదలదని, వైసీపీ నేతలు చేసిన పాపాలే వారిని జైలు పాలు చేస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర ఓపెన్‌గా చెప్పారు. కొడాలి నాని అవినీతి, అరాచకాలపైనా విచారణ జరుపుతామన్నారు.
వంశీ అరెస్ట్‌పై నాని మాట
జైలులో ఉన్న వల్లభనేని వంశీని కలిసేందుకు జగన్‌తోపాటు కొడాలి నాని విజయవాడ జైలుకి వచ్చారు. ఆ సమయంలో ‘బిగ్ టీవీ’ నానిని పలకరించింది. వంశీ అరెస్టుపై మాట్లాడారు ఆయన. ఇది చిన్న విషయం అని, ఇవన్నీ సహజమేనని చెప్పుకొచ్చారు. తనపై 3 కాదు 30 కేసులు పెట్టుకోండంటూ సవాల్ విసిరారు.
ALSO READ: తునిలో హైటెన్షన్.. మరోసారి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
పార్టీలో తాను యాక్టివ్ గానే ఉన్నానని తెలిపారు కొడాలి నాని. ఇన్నాళ్లు ఎందుకు కనిపించలేదన్న ప్రశ్నకు తనదైలి శైలిలో రిప్లై ఇచ్చారు. ఉద్యోగం నుంచి పీకితే ఇంకేం మాట్లాడుతానని అన్నారు. అప్పుడు ప్రభుత్వం ఉండేది, యాక్టివ్‌గా ఉన్నామని తెలిపారు. రెడ్ బుక్‌లో మీ పేరు ఉందని ప్రశ్నించగా, ఆ బుక్ మీరేమైనా చూశారా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. అందులో నా పేరు ఉందో లేదో తనకు తెలియదని చెప్పుకొచ్చారు. రెడ్ బుక్, బ్లూ బుక్ లతో ఎలాంటి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు కొడాలి నాని.
కొడాలి నాని మాటలను గమనించారు కొందరు రాజకీయ నేతలు. వంశీ అరెస్ట్ తర్వాత కొడాలి నాని వాయిస్ మారిందని అంటున్నారు. ఒకప్పుడు తన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేవారని, ఇప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రమే ఇస్తున్నారని అంటున్నారు. రానున్న రోజుల్లో కష్టాలు తప్పవని భావించిన కొడాలి వాయిస్ మారిందని అంటున్నారు.
బిగ్ టీవీతో మాజీ మంత్రి కొడాలి నాని
గతంలో ప్రభుత్వం మాది కాబట్టి ఆక్టివ్ గా మాట్లాడాం
ఇప్పుడు మా ఉద్యోగాలు పోయాయి ఇంకేం మాట్లాడతాం?
మూడు కాకపోతే 30 కేసులు పెట్టుకోండి
ఈ అరెస్టులు ఇవన్ని చాలా చిన్న విషయలు
రెడ్ బుక్ నేను చూడలేదు…..అందులో నా పేరు ఉందో లేదో తెలియదు
– మాజీ… pic.twitter.com/UzgzjH3xya
— BIG TV Breaking News (@bigtvtelugu) February 18, 2025