BigTV English
Advertisement

OTT Movie : చేతి గోర్లు కట్ చేసుకుంటే ఆ ఇంట్లోకి దయ్యాలు వస్తాయి… ఈ మూవీని చూస్తే పార్ట్స్ ప్యాక్ అయిపోతాయి.

OTT Movie : చేతి గోర్లు కట్ చేసుకుంటే ఆ ఇంట్లోకి దయ్యాలు వస్తాయి… ఈ మూవీని చూస్తే పార్ట్స్ ప్యాక్ అయిపోతాయి.

OTT Movie : హారర్ సినిమాలను ఒంటరిగా చూడాలంటే భయపడుతూ ఉంటాం. అదే ఫ్రెండ్స్ తో చూస్తూ భయపడుతూ ఎంటర్టైన్ చేస్తుంటాం. రెండు విధాలుగా ఎంటర్టైన్ చేస్తుంటాయి హారర్ మూవీస్. అయితే ఇండోనేషియన్ హారర్ సినిమాలు వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాయి. డిఫరెంట్ కథలతో ఈ సినిమాలను తీస్తూ ఉంటారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ మూవీలో భార్య భర్తలు కొన్ని సంవత్సరాల తర్వాత సొంత ఇంటికి వస్తారు. ఆ ఇంటిని అమ్మకానికి కూడా పెడతారు. ఆ ఇంట్లో జరిగే భయంకరమైన సన్నివేశాలతో మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్ఫ్లిక్స్ (Netflix) లో

ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘పామాలి’ (Pamali). 2022లో వచ్చిన ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీకి బాబీ ప్రయత్యో దర్శకత్వం వహించారు. కొన్ని సంవత్సరాలుగా పాడుబడిన ఇంటిని అమ్మాలని భార్య భర్తలు సొంత ఇంటికి వస్తారు. ఈ క్రమంలో ఆ ఇంట్లో దయ్యాలతో, వీళ్ళు ఎదుర్కునే సమస్యలతో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

సిటీలో ఉద్యోగాలు చేసుకుని భార్య భర్తలు చాలా సంవత్సరాల తర్వాత తమ సొంత ఊరికి వస్తారు. అక్కడ వీళ్లకు సంబంధించిన ఇంటిని  అమ్మకానికి కూడా పెడతారు. అయితే ఆ ప్రాంతంలో రాత్రిపూట గోర్లు కత్తిరించడం, చీకట్లో బయటికి రావడం నిషేధం ఉంటుంది. అలా బయటికి వస్తే దయ్యాలు వెంటపడతాయని ఆ ఊరి ప్రజలు నమ్ముతారు. ఆ ఇంటిని అమ్మడానికి, అదే ఊరిలో ఇంటి పక్కన ఉండే ఒక వ్యక్తి వీళ్ళకు సాయం చేస్తాడు. అయితే అమ్మడానికి కొంత సమయం పడుతూ ఉండటంతో, వీళ్ళు అదే ఇంట్లో స్టే చేయాల్సి వస్తుంది. అందులో ఒక గదిలో చేతబడి చేసినట్లు ఉంటుంది. అది చూసి భార్యాభర్తలు చాలా భయపడతారు. ఆ వూరిలో దయ్యాలు రాకుండా, అలాంటి పూజలు చేస్తుంటారని ఒక వ్యక్తి వీళ్ళకు చెప్తాడు. ఆ గదిలో ఈ ఫ్యామిలీకి సంబంధించిన ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది.

ఆ గదిలో ఆమె ఎలా చనిపోయిందో కూడా వాళ్లకు తెలియదు. ఇంతలోనే ఆ ఇంట్లో వీళ్లకు దయ్యాలు కనపడుతుంటాయి. ఇక్కడి నుంచి తొందరగా  వెళ్ళిపోవాలని భార్య, భర్తతో చెప్తుంది. అయితే రెండు రోజులు ఉంటే ఇంటిని అమ్మేసి వెళ్ళిపోదామని భర్త ఆమెతో చెప్తాడు. చివరికి ఆ ఇంటిని వీళ్లు అమ్మ గలుగుతారా? దయ్యాల చేతిలో బలవుతారా? గతంలో ఆ ఇంట్లో ఏం జరిగి ఉంటుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘పామాలి’ (Pamali) అనే ఈ ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి. ఒంటరిగా ఈ హారర్ సినిమాను చూడకండి, చీకట్లో అయితే మాత్రం అస్సలు చూడకండి.

Tags

Related News

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

K Ramp OTT : ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్న ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

Big Stories

×