BigTV English

Tuni Municipal Election: తునిలో హైటెన్షన్.. మరోసారి మున్సిపల్‌ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా

Tuni Municipal Election: తునిలో హైటెన్షన్.. మరోసారి మున్సిపల్‌ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా

తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఈ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార టీడీపీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే మున్సిపాలిటీపై పట్టుకోల్పోకుండా ఉండాలని వైసీపీ భావిస్తోంది. ఉపాధ్యక్ష పదవి దక్కించుకునేందుకు ఇరు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. దీంతో ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే వైసీపీ నుంచి 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఇంకా అనేక మంది సైకిల్ ఎక్కేందుకు సిద్దమయ్యారు. అయితే మిగిలిన వైసీపీ కౌన్సిలర్లు పార్టీ వీడకుండా ఉండేందుకు కట్టడి చేయాలని భావిస్తున్నారు మాజీ మంత్రి, కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడి‌శెట్టి రాజా.

ఉద్రిక్త పరిస్థితులు నడుమ ఇప్పటికి మూడుసార్లు ఎన్నిక వాయిదా పడింది. ఇవాళ నాలుగోసారి ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో వైసీపీ చలో తునికి పిలుపునిచ్చింది. తుని మున్సిపల్‌ కార్యాలయానికి టీడీపీ, వైసీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. రెండు గంటలపాటు హైడ్రామా నడిచింది. తోపులాటలు, పరస్పర నినాదాలతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉండటంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి.. రెండు వర్గాలను చెదరగొట్టారు.


మున్సిపల్ ఎన్నికల విషయంలో టీడీపీ అనుసరిస్తున్న విధానంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీడీపీ తీరుకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో ఛలో తుని కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయంపై YCP MLC అప్పిరెడ్డి నేతృత్వంలో ఈసీని కలిసిన వైసీపీ నేతలు టీడీపీపై ఫిర్యాదు చేశారు. ఒక్క సభ్యుడు కూడా లేనిచోట్ల టీడీపీ నేతలు ఎలా పోటీ చేసి గెలుస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగిన ప్రతీ ఉప ఎన్నికలో అక్రమ మార్గాల్లో గెలవాలని చూస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు.

Also Read: వైసీపీ ఛలో తుని.. జిల్లాలో హై టెన్షన్

మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి దక్కించుకోవాలంటే మరో నలుగురు కౌన్సిలర్లు టీడీపీ వైపు మొగ్గు చూపితే చాలు.. వైస్ ఛైర్మన్ పదవి టీడీపీ సొంతమవుతుంది. ఏదేమైనా ఈ ఎన్నిక విషయంలో ఉదయం నుంచి హైడ్రామా నడిచింది. టీడీపీ వర్సెస్ వైసీపీ అనే రేంజ్‌లో యుద్ధ వాతావరణం కనిపించింది. ఇదే సమయంలో కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల ప్రెసిడెంట్ ప్రకటించారు.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×