E-Paper
Advertisement

ONGC Gas Leak: తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉగ్రరూపం.. ఇరుసుమండలో కొనసాగుతున్న హైటెన్షన్!

ONGC Gas Leak: తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉగ్రరూపం.. ఇరుసుమండలో కొనసాగుతున్న హైటెన్షన్!
Advertisement

ONGC Gas Leak: కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ మంటలు తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. గంటలు గడుస్తున్నా మంటల తీవ్రత మాత్రం  తగ్గకపోవడం లేదు. దీంతో  స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. భారీ శబ్దంతో గ్యాస్ ఎగజిమ్ముతుంది.

ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు ఢిల్లీ నుంచి రంగంలోకి దిగింది RCMT ఇంచార్జ్ శ్రీహరి నేతృత్వంలోని నిపుణుల బృందం. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా రెండు లారీల్లో కూలెంట్ ఆయిల్ను అధికారులు అక్కడికి తరలించారు. ప్రస్తుతం నీటితో పాటు మట్టిని ప్రయోగిస్తూ మంటల తీవ్రతను తగ్గించేందుకు శ్రమిస్తున్నారు.

Advertisement

అయితే, ఈ బ్లోఅవుట్‌ను ఎప్పటిలోగా పూర్తిగా అదుపు చేస్తారు అనే దానిపై అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గాలి దిశను బట్టి మంటలు పక్కనే ఉన్న తోటలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. ఇరుసుమండ పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.

భావనకోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో ONGC బ్లోఅవుట్ ఘటనలో ఎవరు అనారోగ్యానికి గురి కాలేదన్నారు డాక్టర్ భావన. ముందస్తుగానే అందరూ పునరావాస కేంద్రాలకు రావడంతో ఇబ్బందికర పరిస్థితులు లేవన్నారు. చిన్న శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లకి మాత్రమే అవసరమైన వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఫైర్ ఇంకా కొనసాగుతుడటంతో.. ప్రజలందరూ మాస్కు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు.

Advertisement

ALSO READ: Yadadri District: కన్నప్రేమ కరువై.. ఆలయ మెట్లపై పసికందు విలవిల!

Related News

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

జనసేన మున్సిపల్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల.. విజయవాడ బరిలో వంగవీటి రాధాకృష్ణ

పల్నాడులో హైటెన్షన్‌.. వైసీపీ కీలక నేతల హౌస్‌ అరెస్ట్‌.. ఆంక్షలపై రాజకీయ దుమారం!

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

Big Stories

Advertisement
×