BigTV English

ktr and roja: అక్కడ కేటీఆర్.. ఇక్కడ రోజా.. మిగతా అంతా సేమ్ టు సేమ్

ktr and roja: అక్కడ కేటీఆర్.. ఇక్కడ రోజా.. మిగతా అంతా సేమ్ టు సేమ్

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణలో బీఆర్ఎస్ దే విజయం అంటుంటారు కేటీఆర్. ప్రజలంతా కేసీఆర్ ని తిరిగి సీఎం చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెబుతారు. ఏపీలో కూడా సరిగ్గా ఇలాంటి డైలాగులే వినపడుతున్నాయి. ఇక్కడ కేటీఆర్ పాత్రని రోజా పోషిస్తున్నారు. ప్రజలంతా జగనే మళ్లీ సీఎం కావాలని అనుకుంటున్నట్టు చెప్పారు రోజా. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. జగన్ రాగానే ఇప్పుడు తప్పు చేస్తున్న అధికారులందరికీ తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు.


ఆంజనేయులుకి సపోర్ట్..
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ నేపథ్యంలో మాజీ మంత్రి రోజా స్పందించారు. ఆయన అరెస్టు డర్టీ డైవర్షన్ పాలిటిక్స్‌కి నిదర్శనం అని అన్నారామె. ఆంజనేయులు తప్పు చేయలేదని, అమాయకుడైన ఆయన్ని అరెస్టు చేయటం దారుణం అన్నారు. కొందరు పోలీసులు తీవ్రమైన తప్పులు చేస్తున్నారని, అలాంటివారిని వదిలిపెట్టేది లేదని, జగన్ తిరిగి సీఎం అయ్యాక, వారందరినీ జైలుకు పంపుతామని చెప్పారు. స్కిల్ కేసులో అక్రమాలు చేసి చంద్రబాబు అరెస్టు అయ్యారని, కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కేసుని తొక్కి పెట్టారని, ప్రభుత్వానికి దమ్ముంటే స్కిల్ కేసులపై సీబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రోజా.

డైవర్షన్..
ఎన్నికల హామీలు అమలు చేయలేక ప్రజా సమస్యలను డైవర్ట్‌ చేయడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డార రోజా. రైతులు, మహిళలు, నిరుద్యోగుల్ని మోసం చేశారని, ప్రశ్నిస్తే వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. చంద్రబాబు పెట్టిన మొదటి సంతకం ఇంకా అమలు కాలేదని, ఆయన మొదటి సంతకం చిత్తు కాగితంతో సమానం అని విమర్శించారు. టీడీపీ నేతలకు గ్రామాల్లోకి వెళ్ళే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు రోజా.


అంతా బాగానే ఉంది కానీ.. 2029లో అధికారం తమదేనని రోజా ఘంటాపథంగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు టీడీపీ నేతలు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కుదిరిందని, ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నామని, అప్పుల కుప్పలా ఏపీని మార్చి ఇప్పుడు తమపై నిందలు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 2024 ఎన్నికల ప్రచారంలో 175 స్థానాలు తమవేనంటూ బీరాలు పలికి 11కి పడిపోయిన సంగతి రోజాకి గుర్తులేదా అని సెటైర్లు పేలుస్తున్నారు. ఇప్పట్నుంచే 2029 ఎన్నికల గురించి ఎలివేషన్లు ఎందుకంటున్నారు.

తెలంగాణలో కూడా కేటీఆర్ ప్రజా తీర్పుని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది, ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కనీసం సింగిల్ సీటు కూడా లేకుండా పోయింది, అయినా కూడా అధికారంలోకి వచ్చేది తామేనంటూ కేటీఆర్ చెప్పుకుంటుంటారు. ఇక్కడ రోజా కూడా సేమ్ డైలాగులు రిపీట్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చేది తామేనని, టీడీపీ సంగతి చెబుతామని ఆమె వార్నింగ్ ఇస్తున్నారు. పోనీ ఎన్నికల సమయంలో ఆత్మవిశ్వాసంతో ఇలా చెప్పినా పర్లేదు, ఎన్నికలు జరిగిన ఏడాదిన్నరలోనే ప్రజా తీర్పుని అవహేళన చేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి ప్రత్యర్థి వర్గాలు. ప్రజా తీర్పు ఐదేళ్లపాటు ఉంటుందనే ప్రాథమిక జ్ఞానం కూడా వారికి లేదని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×