BigTV English

Nani: శైలేష్ కు క్లాస్ పీకిన నాని

Nani: శైలేష్ కు క్లాస్ పీకిన నాని

Nani: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొంతమంది మాత్రం వాళ్లు ఎదగడమే కాకుండా తమ చుట్టూ ఉండే వాళ్ళు ఎదిగే రకంగా ప్లాన్ చేస్తారు. దీనికి మంచి ఉదాహరణ సుకుమార్. తన దగ్గర పని చేసే అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కూడా డైరెక్టర్ గా మారే ప్రయత్నం చేస్తున్నారు. ఇక హీరో నాని విషయానికి వస్తే చాలా మంది కొత్త దర్శకులను పరిచయం చేస్తూ, నిర్మాతగా కూడా కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాడు. నాని నిర్మాతగా పరిచయం చేసిన దర్శకులలో శైలేష్ కొలను ఒకరు. హిట్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శైలేష్. విశ్వక్సేన్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఇదే సినిమాను హిందీలో కూడా తెరకెక్కించాడు శైలేష్. అక్కడ కూడా ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది.


హిట్ 2 సక్సెస్

హిట్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో హిట్ 2 సినిమా కూడా అదే స్థాయిలో హిట్ అయింది. అంచనాలకు ఎక్కడా తగ్గకుండా శైలేష్ ఈ సినిమాను అద్భుతంగా తీశాడు. ముఖ్యంగా ఈ సినిమాలోని ట్విస్టులు అదిరిపోయాయి. ఇప్పుడు నాని హీరోగా హిట్ 3 సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు శైలేష్. ఇదివరకే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ ట్రైలర్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ, నాని యాక్షన్ సినిమా చేస్తే ఇష్టపడని వాళ్ళు ఈ సినిమా రావద్దు అని డైరెక్ట్ గా చెప్పేసాడు. నాని యాక్షన్ సినిమా చేస్తే చూడాలనుకునే వాళ్ళకి ఈ సినిమా మంచి ట్రీట్ అవుతుంది.


శైలేష్ కు క్లాస్

హిట్ 2 సినిమా చివర్లో నానిని శైలేష్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే హిట్ 3 సినిమా మొదలు పెట్టినప్పుడు నాని ఏం చేసినా కూడా శైలేష్ పెద్దగా అబ్జెక్ట్ చేసేవాడు కాదట. నాని 3 వేరియేషన్లు చూపిస్తే మీకు ఏది అనిపిస్తుంది అన్న అని తిరిగి అడిగేవారట. అయితే ఈ విషయంపై నాని క్లాస్ పీకడం మొదలుపెట్టాడు. నువ్వు నా ఒక్కడితోనే సినిమాలు చేయవు. అసలు నీకేం కావాలో అది చేయించుకో అంటూ చెప్పడంతో శైలేష్ అక్కడితో రెచ్చిపోయాడు అంటూ నాని తెలిపాడు. నాని శైలేష్ ను పరిచయం చేయడం వల్లనే తన దగ్గర భయం భయంగా ఉండేవాడు. కానీ నానికి సినిమా మీద ఉన్న డెడికేషన్ తెలిసి సెకండ్ షెడ్యూల్ నుంచి తన పని తాను చేయడం మొదలుపెట్టాడు. అలా చేయడంవల్లనే సినిమా ట్రైలర్ మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది. ఇక సినిమా ఏ స్థాయిలో ఉంటుందో త్వరలో తెలియనుంది.

Also Read : రామ్ నన్ను బ్లాక్ చేశాడు… బిగ్ బాస్ బ్యూటీ ఆవేదన

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×