IAS Transfers : తెలంగాణాలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన అనేక శాఖలకు నూతన ఐఏఎస్ అధికారుల్ని కేటాయించిన ప్రభుత్వం.. మొత్తంగా 13 మందిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వారికి ఈ శాఖలు కేటాయించింది.
1. GHMC కమిషనర్ గా ఇలంబర్తి
2. ట్రాన్స్ కో సీఎండీగా కృష్ణ భాస్కర్
3. ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా సురేంద్ర మోహన్
4. ఆరోగ్య శ్రీ సీఈవోగా శివ శంకర్
5. పంచాయతీరాజ్ డైరెక్టర్ గా శ్రీజన్
6. ఆయుష్ డైరెక్టర్ గా చిట్టెం లక్ష్మి
7. ఇంటర్మీడియట్ డైరెక్టర్ గా కృష్ణ ఆదిత్య
8. జీఏడీ కమిషనర్ గా గౌరవ్ ఉప్పల్
9. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా హరికిరణ్
10. లేబర్ కమిషనర్ గా సంజయ్ కుమార్
11. టూరిజం, కల్చరల్ సెక్రటరీగా స్మితా సబర్వాల్
12 బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీగా శ్రీధర్
13. మహిళ,శిశు సంక్షేమ శాఖ సెక్రటరీగా అనితా రామచంద్రన్
వీరితో పాటు మరో 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులకు కూడా స్థానచలనం కలిగించిన తెలంగాణా ప్రభుత్వం.. వారికి జిల్లాలు, వివిధ మంత్రిత్వ శాఖలు కేటాయించింది. ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా.. అధికారులంతా వెనువెంటనే పోస్టింగుల్లో చేరిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.