BigTV English

Sudigali Sudheer: ప్రభాస్ హీరోయిన్ పై ‘గాలోడు’ కన్ను ముందే పడిందంట..

Sudigali Sudheer: ప్రభాస్ హీరోయిన్ పై ‘గాలోడు’ కన్ను ముందే పడిందంట..

Sudigali Sudheer: ఇండస్ట్రీలో అదృష్టం.. ఎవరిని ఎప్పుడు వరిస్తుందో చెప్పలేం. ఇప్పుడు స్టార్స్  గా  ఉన్న హీరోయిన్స్ లో సగం మంది  ఈ ప్రొఫెషన్ ను కావాలని ఎంచుకున్నారు. కానీ, కొంతమందిని మాత్రం ఇండస్ట్రీనే కావాలని ఎంచుకుంది అంటే అతిశయోక్తి లేదు. ఎంతోమంది హీరోయిన్స్ ను స్టార్ డైరెక్టర్స్, నిర్మాతలు బయట చూసి.. హీరోయిన్ గా చేస్తే బావుంటుంది అనుకోని వారి ఇంటికి వెళ్లి అడిగి హీరోయిన్స్ గా మార్చిన వారు ఉన్నారు.


ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే .. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. అది కూడా  ఇంకా రిలీజ్ కూడా కానీ సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ గా  మారిపోయింది ఇమాన్వి. ప్రభాస్- హను రాఘవపూడి కాంబోలో వస్తున్న ఫౌజీ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. పూజా కార్యక్రమంలో అమ్మడిని ఇండస్ట్రీకి పరిచయం చేసారు మేకర్స్. ఇంకేముంది.. అమ్మడు ఎవరు.. ? అంతకుముందు ఏం చేసింది.. ? ఎక్కడనుంచి వచ్చింది.. ? ఇలా ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

Dil Raju: దిల్ రాజు డ్రీమ్స్.. ఇక్కడ రికమెండేషన్స్ లేవమ్మా


ఇమాన్వి ఒక కొరియోగ్రాఫర్, డ్యాన్సర్. సోషల్ మీడియాలో  ఆమె చేసిన ఒక డ్యాన్స్ వీడియో చాలా వైరల్ గా మారింది. ఇక ఆ వీడియో చూసే హను.. ఇమాన్విని ఓకే చేశారట. అయితే ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏంటంటే.. హను కన్నా ముందే.. ఇమాన్విని ఒక సినిమాలో హీరోయిన్ గా నటించమని ఒక హీరో అడిగాడట. అవును.. మీరు వింటున్నది నిజమే. ఆ హీరో ఎవరో కాదు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ గాలోడు సినిమాతో హీరోగా మారదు.

మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న సుధీర్.. ఆ తరువాత గోట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బ్యాచిలర్ బ్యూటీ దివ్య భారతి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన  పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా  ఆకట్టుకున్నాయి. అయితే  ఈ సినిమాకు బడ్జెట్ ప్రాబ్లమ్స్ రావడంతో ఇప్పుడు  ఆగిపోయిందని టాక్.

Ananya Nagalla: తెలుగమ్మాయి మరో మెగా ఛాన్స్ పట్టేసిందిగా..

ఇక ఆ విషయం పక్కన పెడితే.. గోట్ సినిమా కోసం దివ్య భారతి కన్నా ముందు ఇమాన్విని అనుకున్నాడట. వీడియో వైరల్ అయిన వెంటనే ఆమె కాంటాక్ట్ కనుక్కొని హీరోయిన్ గా చేయమని అడిగాడట. కానీ, ఆమె రిజెక్ట్ చేయడంతో  దివ్య భారతిని తీసుకున్నారట. ఈ విషయాన్నీ సుధీర్ ఫ్రెండ్ గెటప్ శ్రీను ఒక షోలో చెప్పుకొచ్చాడు.

ఫౌజీ పూజా కార్యక్రమం అయ్యాక.. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలను చూసి గెటప్ శ్రీను.. సుధీర్ కు కాల్ చేసి ఆ అమ్మాయే ఈ అమ్మాయి అని చెప్పాడట. అవునురా.. ఆ అమ్మాయే అని సుధీర్ చెప్పినట్లు  శ్రీను చెప్పుకొచ్చాడు. సుధీర్ అంటే రిజెక్ట్ చేసిన ఈ బ్యూటీ ప్రభాస్ అనేసరికి ఓకే చేసిందా.. ? అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి  ఈ సినిమాతో అమ్మడి రేంజ్ ఏ రేంజ్ లో మారుతుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×