Lady Aghori: లేడీ అఘోరీ అంటే తెలియని వారుండరు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమె క్రేజ్ అంతా ఇంతా కాదు. పలుమార్లు వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు అఘోరీ మాత. అంతేకాదు పలు ఆలయాలు సందర్శించిన సమయంలో కూడ, ఈమె వైఖరితో పోలీసులకు, అఘోరీకి వాగ్వివాదం కూడ సాగింది. గత కొద్దిరోజులుగా కనిపించని అఘోరీ, మంగళవారం మరోమారు ఏపీలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ పోలీసులతో వాగ్వివాదం చేయగా, అక్కడి నుండి పోలీసులు పంపించారు.
తెలంగాణకు చెందిన లేడీ అఘోరీ వార్తల్లోకి వచ్చిన సమయం నుండి ఏదొక వివాదంలో ఉంటూ వార్తల్లో నిలిచారు. సనాతన ధర్మ పరిరక్షణకు తాను ప్రజల్లోకి వచ్చినట్లు కూడ అఘోరీ చాలాసార్లు ప్రకటించారు. అయితే కార్తీక మాసంలో ఏపీలోని పలు శివాలయాలను సందర్శించిన అఘోరీ, వస్త్రధారణ పాటించక పోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత కారు ప్రమాదం, విజయవాడలో దాడి ఇలాంటి ఘటనలు ఏపీలో సాగాయి. ఆ తర్వాత నేరుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాలని, రహదారిపై బైఠాయించారు అఘోరీ. అక్కడ పోలీసులతో రచ్చరచ్చ సాగింది.
ఆ తర్వాత తెలంగాణలోకి అడుగుపెట్టిన అఘోరీ మాత వరంగల్ శ్మశానవాటికలో క్షుద్ర పూజలు చేశారన్న ఆరోపణలు కూడ ఎదుర్కొన్నారు. అక్కడ కోడిని బలిచ్చినట్లు ఫిర్యాదు అందగా, పోలీసులు కేసు కూడ నమోదు చేశారు. ఆ తర్వాత అఘోరీ మాత మరెక్కడా కనిపించలేదు. తపస్సు కోసం వెళ్ళినట్లు అందరూ భావించారు. ఈ తరుణంలో అఘోరీ మాత మంగళవారం ఏపీలో ప్రత్యక్షమయ్యారు. యన్.టి.ఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ గేట్ వద్ద అఘోరీ కనిపించారు.
Also Read: Tirumala: తిరుమల అలిపిరి మెట్ల మార్గం ఓ అద్భుతం.. ఇక్కడికి వెళ్లే భాగ్యం మీకు దక్కిందా?
ఈసారి తలపై శిరోజాలు పెద్ద ఎత్తున ధరించి, దిగంబరంగా అఘోరీ కనిపించడంతో స్థానికులు గుమికూడారు. పోలీసులు సమాచారం అందుకొని అక్కడికి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా, అఘోరీ శివాలెత్తినట్లు తెలుస్తోంది. మీలాంటి వారిని ఇంత మందిని చూసినట్లు అఘోరీ మాత చేతులతో సైగ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కుంభమేళాకు అఘోరీ వెళుతున్నారా? లేక తెలంగాణకు వస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద అఘోరీకి నచ్చజెప్పి, విజయవాడ వైపుకు పంపినట్లు సమాచారం.
మళ్లీ ప్రత్యక్షమైన అఘోరి
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట చిలకల టోల్ ప్లాజా వద్ద కనిపించిన అఘోరి
హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా భీమవరం గట్టు వద్ద పోలీసులతో వాగ్వాదం
పట్టణ సీఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి నచ్చజెప్పి అఘోరిని చెన్నై వైపు తరలింపు pic.twitter.com/dpj1865j6f
— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2025