BigTV English

Lady Aghori: కారులో లేడీ అఘోరీ తాంత్రిక పూజలు? ఆగ్రహంతో అద్దాలు బద్దలు కొట్టిన ప్రజలు?

Lady Aghori: కారులో లేడీ అఘోరీ తాంత్రిక పూజలు? ఆగ్రహంతో అద్దాలు బద్దలు కొట్టిన ప్రజలు?

Lady Aghori: అఘోరీ మాత మరోమారు ఏపీలో హల్చల్ చేశారు. ఉదయం మంగళగిరి వద్ద హల్చల్ చేసినా అఘోరీ మాత.. మరో మారు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద కారులోనే ఉంటూ.. ఓ రకంగా నిరసన తెలుపుతున్నారని చెప్పవచ్చు.


ఉదయం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఎదురుగా రహదారిపై బైఠాయించిన అఘోరీ మాతను పోలీసులు ఎట్టకేలకు నచ్చజెప్పి, అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశారు. అనంతరం హైదరాబాద్ కు వెళ్లాలని సూచిస్తూ తెలంగాణ సరిహద్దు వద్ద అఘోరీ మాతను పోలీసులు విడిచిపెట్టారు. అయితే అక్కడి నుండి తెలంగాణలోకి ప్రవేశించకుండా అఘోరీ మాత మళ్లీ విజయవాడ వైపు పయనమై, ఇబ్రహీంపట్నం వద్ద కారును రహదారిపై నిలిపివేశారు. అయితే ఈసారి కారులో నుండి బయటకు రాకుండా, కారులోనే దీపాన్ని వెలిగించి పూజలు చేయడం విశేషం.

హైదరాబాద్ – విజయవాడ రహదారిలో ట్రాఫిక్ స్తంభించగా, పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అఘోరీ మాతను కారులో నుండి బయటికి రావాలని పోలీసులు కోరినా ససేమిరా వినకుండా.. కారులోనే అఘోరి ఉండిపోయారు. ఈ విషయం స్థానిక ప్రజలకు తెలియగా పెద్ద సంఖ్యలో అక్కడికి గుమికూడారు. కారులో నుండి బయటకు రావాలని పోలీసులు, ప్రజలు కోరినా అఘోరి నుండి మాత్రం ఎటువంటి స్పందన లేని పరిస్థితి. ఏమి చేయాలో దిక్కు తెలియని స్థితిలో ప్రజలు, పోలీసులు కారు అద్దాలను ధ్వంసం చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కారులో హారతి మాదిరిగా వెలిగించి పూజలు చేస్తున్న క్రమంలో, ఆ పొగ ధాటికి అఘోరీకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నట్లు, అందుకే కారు అద్దాలు పగలగొడుతున్నట్లు యువకులు తెలుపుతున్నారు.


Also Read: TTD on Roja: మాజీ మంత్రి రోజాకు షాక్.. అంతా అవకతవకలేనంటూ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటన

సనాతన ధర్మ పరిరక్షణకై తాను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి తీరాలని ఉదయం తెలిపిన అఘోరీ మాత, మరల ఇబ్రహీంపట్నం వద్ద కారులోనే ఉంటూ పూజలు చేయడం సంచలనంగా మారింది. పోలీసులు మాత్రం ఎలాగైనా బయటకు రావాలని ప్రాధేయ పడుతున్న పరిస్థితి ఇబ్రహీంపట్నంలో నెలకొంది. మంగళగిరిలో ఉదయం మీడియా ప్రతినిధులు, పోలీసులు, స్థానిక యువకులపై దాడి చేసిన అఘోరీ మాత, సాయంత్రం ఇబ్రహీంపట్నంలో హల్చల్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. అయితే అఘోరీ మాత కారులోనే తాంత్రిక పూజలు చేస్తున్నారా.. అంటూ అక్కడి ప్రజలు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×