Lakshmi – Kiran Royal: జనసేన నేత కిరణ్ రాయల్ పై లక్ష్మీ సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల కిరణ్ రాయల్ పై లక్ష్మీ అనే మహిళ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కిరణ్ రాయల్ కూడా వాటిని ఖండించారు. అయితే లక్ష్మీని ఇటీవల జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టు బెయిల్ ఇచ్చిన అనంతరం విడుదల చేశారు. శనివారం తిరుపతికి వచ్చిన లక్ష్మీ మీడియా సమావేశం నిర్వహించి సంచలన విషయాలు వెల్లడించారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం ఏపీలో దుమారం రేపుతున్నాయి.
లక్ష్మీ మాట్లాడుతూ.. తనను దౌర్జన్యంగా జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారని, లోకల్ పోలీసులు లేకుండా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఒక వెధవను వెధవా అని నిరూపించేందుకు ఇన్ని ఇబ్బందులు ఉంటాయని, తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. తనను అరెస్ట్ చేసి జైపూర్ పోలీసులు కోర్టు ముందు హాజరుపరిస్తే, 41 ఏ నోటీసులు ఇచ్చారా అంటూ జడ్జి అడిగిన ప్రశ్నకు పోలీసుల వద్ద సమాధానం లేదన్నారు. తనను జైపూర్ పోలీసుల ద్వారా కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారని ఆమె విమర్శించారు.
వైసీపీ నాయకుల మద్దతు ఉందని కిరణ్ రాయల్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో తనకు ఉన్న ఏకైక ప్రాపర్టీని అమ్ముకొని బెయిల్ పొందానన్నారు. అబ్దుల్ ఘనీ తన గురించి చెబుతున్న ఆరోపణల్లో నిజం లేదని, ఆటోడ్రైవర్ కు ముందు కిరణ్ రాయల్ అనుచరుడిగా ఘనీ ఉన్నట్లు ఆమె తెలిపారు. కిరణ్ రాయల్ ఏమి చెప్పినా చెల్లిపోతుందని అనుకుంటున్నాడని, ఇక్కడ ఎవరూ అంత అమాయకులు లేరన్నారు.
ఆ పెన్ డ్రైవ్ ఉందని కిరణ్ రాయల్ చెప్పాడు – లక్ష్మీ
తనతో కిరణ్ రాయల్ సన్నిహితంగా ఉన్న సమయంలో చాలా విషయాలు వెల్లడించినట్లు లక్ష్మీ అన్నారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తన వెంట ఉన్నారని ఎప్పుడూ చెప్పేవాడన్నారు. తన వద్ద పవన్ రహస్య జీవితానికి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉందని, తనను పవన్ ఏమి చేయలేడని చాలా సార్లు చెప్పినట్లు ఆమె ఆరోపించారు. మాజీ మంత్రి రోజా దగ్గరి బంధువును కూడా కిరణ్ రాయల్ ట్రాప్ చేశారని, అవసరానికి వాడుకొని అవసరం తీరాక, ఆమెపై దాడి చేసిన చరిత్ర కిరణ్ రాయల్ కే దక్కుతుందని సంచలన కామెంట్స్ చేశారు.
Also Read: Srisailam Devasthanam: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం వెళ్తున్నారా.. తప్పక ఇవి తెలుసుకోండి
ఆ కారణం వల్లే వైసీపీ ప్రభుత్వ హయాంలో కిరణ్ రాయల్ ను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన కారణం వేరైతే, పార్టీ కోసం అంటూ కిరణ్ బిల్డప్ ఇచ్చారన్నారు. తనకు టైమ్ వస్తే పవన్ నే బెదిరిస్తానని, నువ్వెంత అంటూ కిరణ్ రాయల్ చాలా సార్లు బెదిరించినట్లు లక్ష్మీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. జైపూర్ నుండి వచ్చిన లక్ష్మీ.. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకు లక్ష్మీ చేసిన ఆరోపణలు నిజమేనా? కిరణ్ రాయల్ వద్ద పెన్ డ్రైవ్ ఉన్న మాట వాస్తవమేనా? ఆ పెన్ డ్రైవ్ లో ఏముందన్నది ఇప్పుడు చర్చ సాగుతోంది. ఈ అనుమానాలకు తెర పడాలంటే లక్ష్మీ చేసిన ఆరోపణలకు కిరణ్ రాయల్ స్పందించాల్సి ఉంది.